ఆ తొమ్మిదింటిలో టీడీపీకే అడ్వాంటేజ్ అట

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఖాతా తెర‌వ‌ని నాలుగు జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం ఒక‌టి. క‌ర్నూలు, క‌డ‌ప‌, నెల్లూరుతో పాటు ఉత్తరాంధ్రలోని విజ‌య‌న‌గ‌రంలో కూడా టీడీపీకి ఒక్క సీటు [more]

Update: 2021-09-11 03:30 GMT

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఖాతా తెర‌వ‌ని నాలుగు జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం ఒక‌టి. క‌ర్నూలు, క‌డ‌ప‌, నెల్లూరుతో పాటు ఉత్తరాంధ్రలోని విజ‌య‌న‌గ‌రంలో కూడా టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అశోక్ గ‌జ‌ప‌తిరాజు, ఆయ‌న కుమార్తె అదితి, అటు బొబ్బిలి రాజులు, కురుపాం రాజులు అంద‌రూ టీడీపీ నుంచి పోటీ చేసి క‌ట్టక‌ట్టుకుని మ‌రీ ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన రెండున్నరేళ్లలో ఇప్పుడు అక్కడ పార్టీ ప‌రిస్థితి చూస్తే వైసీపీ ప‌ట్టు క్రమ‌క్రమంగా స‌డ‌లుతోంది. జిల్లాలో ఉన్న 9 సీట్లలో ప‌లువురు ఎమ్మెల్యేలు ఏటికి ఎదురీదుతున్నారు.

బొబ్బిలిలో ఫుల్ స్వింగ్ లో…

జిల్లాలో టీడీపీ బొబ్బిలిలో ఫుల్‌స్వింగ్‌లో ఉంది. మాజీ మంత్రి సుజ‌య్ కృష్ణ ప్లేసులో కొత్త ఇన్‌చార్జ్‌గా ఆయ‌న సోద‌రుడు బేబీ నాయ‌న వ‌చ్చారు. బేబీ నాయ‌న ప్రజ‌ల్లో విస్తృతంగా ప‌ర్యటిస్తున్నారు. బ‌ల‌మైన మాస్ లీడ‌ర్ కావడం ఆయ‌న‌కు ఉన్న ప్లస్ పాయింట్‌. ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌లు, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ బొబ్బిలిలో టీడీపీకి ఎక్కువ సీట్లు వ‌చ్చాయి. మున్సిపాల్టీ సైతం తృటిలో చేజారింది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చిన అప్పల‌నాయుడు లేదా ఇత‌ర నేత‌లు ఎవ్వరూ కూడా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న‌కు పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేదు.

డిప్యూటీ సీఎంది కూడా….

ఇక కురుపాంలో వ‌రుస‌గా రెండు సార్లు గెలుస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పాముల పుష్ప శ్రీవాణి సైతం తీవ్రమైన వ్యతిరేక‌త ఎదుర్కొంటున్నారు. ఆమెను సొంత కుటుంబ స‌భ్యులే టీడీపీలో ఉండ‌డం పెద్ద ఎదురు దెబ్బే. పైగా ఈ సారి ఆమెకు ట్రైకార్ చైర్మన్ శోభా స్వాతిరాణి రూపంలో పార్టీలోనే మ‌రో ప్రత్యర్థి ఎదురు కానున్నారు. పార్వతిపురంలో అల‌జంగి జోగారావుపై తీవ్రమైన అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. పార్టీ అధిష్టానం సైతం ఆయ‌న విష‌యంలో సుముఖంగా లేద‌నే అంటున్నారు. జె. ప్రస‌న్నకుమార్ సొంత పార్టీలోనే ఆయ‌న‌కు ఇక్కడ స‌వాళ్లు రువ్వుతున్నారు.

ట్రాక్ తప్పడంతో…?

ఇక పార్టీ ట్రాక్ త‌ప్పిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎస్‌.కోట కూడా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే క‌డుబండి శ్రీనివాస‌రావు నియోజ‌క‌వ‌ర్గానికి నాన్ లోక‌ల్‌. అయినా గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వేవ్‌లో గెలిచారు. ఇప్పుడు కూడా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా వైజాగ్‌లోనే ఉంటున్నారు. ఇక్కడ కేడ‌ర్‌ను పూర్తిగా గాలికొదిలేసిన ప‌రిస్థితి ఉంది. ఇక విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ నేత అశోక్ ఫ్యామిలీకి ఈ సారి బ‌ల‌మైన సానుభూతి తోడు కానుంది. దీనికి తోడు కోల‌గ‌ట్లకు గ్రూపు రాజ‌కీయాల‌తో పాటు ఆయ‌న వ‌యోః భారంతో ఉండ‌డంతో సీటు వ‌స్తుందా ? రాదా ? అన్న డౌట్ ఉంది. ఇక సాలూరులోనూ రాజ‌న్నదొర వ‌య‌స్సు పై బ‌డ‌డంతో యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఏదేమైనా జిల్లాలో చీపురుప‌ల్లి, నెల్లిమ‌ర్ల, గ‌జ‌ప‌తిన‌గ‌రం మిన‌హా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ప‌రిస్థితి రెండున్నరేళ్లలోనే రివ‌ర్స్ అయ్యింది

Tags:    

Similar News