టీఆర్ఎస్‌లో టీడీపీ విలీనం.. ఓ సంచ‌ల‌నమేగా?

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? నిన్న మొన్నటి వ‌ర‌కు.. పార్టీ దూకుడుగా ఉంద‌ని.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ స‌హా దుబ్బాక ఉప ఎన్నిక‌లోనూ పార్టీ త‌ర‌ఫున నేత‌లు [more]

Update: 2021-04-08 09:30 GMT

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? నిన్న మొన్నటి వ‌ర‌కు.. పార్టీ దూకుడుగా ఉంద‌ని.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ స‌హా దుబ్బాక ఉప ఎన్నిక‌లోనూ పార్టీ త‌ర‌ఫున నేత‌లు పోటీ చేశారు. గెలిచారా ? ఓడారా ? అన్న విష‌యాలు ప‌క్కన పెడితే.. పార్టీ అంటూ ఉండ‌డం.. పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే వారు ఉండ‌డ‌మే ఎక్కువ‌గా టీడీపీ నేత‌లు భావించారు. అయితే.. ఇప్పుడు ఏకంగా నేత‌లు పార్టీ మారిపోయారు. అంతేకాదు.. ఏడాదిన్నర కింద‌ట‌.. కాంగ్రెస్‌ను అధికార టీఆర్ఎస్‌లో విలీనం చేసిన‌ట్టుగానే ఇప్పుడు టీడీపీని కూడా గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్న ప్రక‌టించారు. దీంతో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది.

పార్టీని విలీనం చేస్తున్నట్లు…..

టీఆర్ఎస్‌లో తెలంగాణ టీడీపీ శాసనాసభా పక్షాన్ని విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు ప్రకటించారు. ఈ సందర్భంగా నాగేశ్వర రావు మాట్లాడుతూ తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శాసనసభా వ్యవహరాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మెచ్చా భేటీ అయ్యారు. అనంతరం మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి లేఖ అందించారు. టీడీపీ శాసనాసభా పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌కి లేఖ ఇచ్చారు.

గత ఎన్నికల్లో ఇద్దరే గెలిచి….

వాస్తవానికి 2018 ఎన్నిక‌ల్లో టీడీపీ కొన్ని చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. ఈ క్రమంలో అసెంబ్లీలో అంతో ఇంతో ప్రాధాన్యం ఉంద‌ని అంద‌రూ భావించారు. అయితే.. అనూహ్యంగా కీల‌క నేత‌.. పార్టీకి వెన్నుద‌న్నుగా ఉన్న మెచ్చా నాగేశ్వర‌రావు కూడా పార్టీ మారిపోవ‌డం ఇప్పుడు శ‌రాఘాతంగా మారిపోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వర్ రావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు.

ప్రాతినిధ్యం లేకుండా….

తరువాత కొంతకాలానికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గులాబీ పార్టీలో చేరారు. అయితే తనకు టీడీపీని వీడే ఉద్దేశం లేదని మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రెండున్నరేళ్లుగా ఆయ‌న టీడీపీని ప‌ట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. తాజాగా టీడీపీకి మెచ్చా నాగేశ్వర్ రావు రాజీనామా చేశారు. అనంతరం టీటీడీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస‌రెడ్డికి ఎమ్మెల్యేలు వెంకట వీరయ్య, నాగేశ్వర్ రావు లేఖ అందించారు. దీంతో తెలంగాణ శాసనసభలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది.

Tags:    

Similar News