టెక్కలిలో చుక్కలు చూపించిన వైసీపీ

శ్రీకాకుళం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. అటువంటి చోట 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగింది. టీడీపీకి కేవలం రెండు సీట్లు తప్ప మొత్తం ఎమ్మెల్యేలను ఊడ్చేసింది [more]

Update: 2021-02-24 13:30 GMT

శ్రీకాకుళం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. అటువంటి చోట 2019 ఎన్నికల్లో ఘోర పరాభవం జరిగింది. టీడీపీకి కేవలం రెండు సీట్లు తప్ప మొత్తం ఎమ్మెల్యేలను ఊడ్చేసింది వైసీపీ. ఇక శ్రీకాకుళం జిల్లాలో నాడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న కళా వెంకటరావు స్వయంగా ఎమ్మెల్యేగా ఓటమి పాలు అయ్యారు. ప్రస్తుత టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మెజారిటీ దారుణంగా తగ్గినా మొత్తానికి గెలిచారు. అయితే రెండేళ్ళు తిరగకుండా పంచాయతీ ఎన్నికలు వస్తే అచ్చెన్న ఇలాకా టెక్కలిలో వైసీపీ చుక్కలు చూపించడం మాత్రం ఆశ్చర్యమే.

అక్కడ తప్ప ….

టెక్కలిలో అచ్చెన్న కుటుంబానికి దశాబ్దాలుగా బలం ఉంది. అయితే జగన్ తెలివిగానే వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ని తెచ్చి టెక్కలి నియోజకవర్గ ఇంచార్జిని చేశారు. జగన్ అతనికి ఎమ్మెల్యే హోదా అనధికారికంగా కట్టబెట్టారు. అచ్చెన్నని ఓడగొట్టాలన్న టార్గెట్ తో దువ్వాడ శ్రీనుకు అన్నీ రకాలుగా ఫ్రీడం ఇచ్చేశారు. దాంతో పంచాయతీ ఎన్నికల్లో దువ్వడ బాగా రెచ్చిపోయారు. ఏకంగా అచ్చెన్న సొంత గ్రామం నిమ్మాడలో వైసీపీ అభ్యర్ధిని నిలిపి నాలుగు దశాబ్దాల తరువాత అక్కడ ఎన్నికలు పెట్టించారు. అక్కడ సహజంగానే టీడీపీ గెలిచి్ది. కానీ కీలకమైన చోట్లలో మాత్రం పట్టు కోల్పోయింది.

కోటలు కూలాయా…?

టెక్కలి మేజర్ పంచాయతీని ఏకగ్రీవంగా వైసీపీ గెలుచుకుంది. ఇక టీడీపీకి కంచు కోటగా ఉన కోట బొమ్మాళి మండలంలోని అన్ని పంచాయతీలు వైసీపీ పరం అయ్యాయి. టెక్కలిలో నియోజకవర్గంలో మొత్తం 139 పంచాయతీలు ఉంటే వందకు పైగా వైసీపీ మద్దతుదారులు గెలిచారు అంటే అది దువ్వాడ శ్రీనివాస్ వేసిన మాస్టర్ స్కెచ్ తోనే అని ఆ పార్టీ వారు అంటున్నారు. ఒక విధంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న అచ్చెన్నకు ఇది అవమానమని కూడా చెబుతున్నారు.

ఆటలు సాగలేదా…?

శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే తెర వెనక బంధాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. అచ్చెన్న గెలిచినా ఎర్రనాయుడు కొడుకు రామ్మోహన్ ఎంపీగా గెలిచినా కూడా వైసీపీ పెద్దల నుంచి పరోక్ష సాయం లభించింది అని చెబుతారు. మరి అలాంటిది ఈసారి మాత్రం దువ్వాడ వీరిని ఎవరినీ వేలూ కాలూ పెట్టనీయకుండా తానే అభ్యర్ధులను ఎంపిక చేసి మరీ అచ్చెన్న మీద రివెంజ్
తీర్చుకున్నారు అంటున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం కూడా దువ్వాడకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నమ్ముతోంది. మొత్తానికి కళా నాడు అలా ఓడితే అచ్చెన్న నేడు ఇలా దెబ్బ తిన్నారని అంటున్నారు. ఇదే సీన్ కొనసాగితే 2024 ఎన్నికల నాటికి అచ్చెన్నకు దువ్వాడ ఎమ్మెల్యే అభ్యర్ధిగా గట్టి పోటీ ఇవ్వడమే కాదు, గెలిచినా గెలుస్తాడు అంటున్నారు.

Tags:    

Similar News