టీడీపీ కంచుకోట‌లో ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే..!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి. ఇక్కడ ప్రత్యర్థులు ఇద్దరూ కూడా క‌త్తులు నూరుకుంటున్న వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఈ [more]

Update: 2020-09-26 13:30 GMT

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి. ఇక్కడ ప్రత్యర్థులు ఇద్దరూ కూడా క‌త్తులు నూరుకుంటున్న వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌ట్టు పెంచుకుంది. 1983 నుంచి 1994 వ‌ర‌కు వ‌రుస‌గా విజ‌యాలు సాధించి.. సైకిల్ ప‌రుగులు పెట్టింది. 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌గా, 2014 ఎన్నిక‌ల్లో మాత్రం టీడీపీ త‌ర‌ఫున ఆరిమిల్లి రాధాకృష్ణ విజ‌యం సాధించారు. దీంతో టీడీపీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించేందుకు ఆయ‌న ప్రయ‌త్నించారు. కానీ, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. స్వల్ప మెజార్టీతో వైసీపీ ఇక్కడ పాగా వేసింది.

ఏ మాత్రం తగ్గకుండా..?

గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం సాధించిన కారుమూరి నాగేశ్వర‌రావు వైసీపీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కారు. ఇటు, వైసీపీలో ఎమ్మెల్యే కారుమూరు సీనియ‌ర్ కావ‌డం, అటు టీడీపీలో యువ‌కుడు అయినా త‌న‌కంటూ ప్రత్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ లీడ‌ర్ కావ‌డంతో ఎవ్వరూ వెన‌క్కు త‌గ్గడం లేదు. టీడీపీ ప‌ట్టు పెంచేందుకు రాధాకృష్ణ.. ప్రభుత్వంపై విమ‌ర్శలు చేయ‌డంలో ఎక్కడా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇక‌, త‌న‌కు జ‌గ‌న్ ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో కారుమూరి నాగేశ్వర‌రావు కూడా వెనుకంజ వేయ‌డం లేదు. ఆరిమిల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కారుమూరి ఎప్పటిక‌ప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి ఆయ‌న్ను విమ‌ర్శిస్తూనే ఉండేవారు. ఇప్పుడు ఆరిమిల్లి సైతం కారుమూరిపై వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శలు చేస్తూనే ఉన్నారు.

క్యాడర్ చెదిరిపోకుండా…..

గ‌తంలో కారుమూరి కావాల‌ని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆరిమిల్లిని రెచ్చగొట్టేలా ప్రెస్‌మీట్లు పెట్టేవార‌న్న టాక్ ఉంది. ఇప్పుడు ఆరిమిల్లి సైతం కారుమూరి పాల‌న‌లో జ‌రుగుతోన్న అవినీతిని ఎప్పుక‌ప్పుడు ప్రజ‌ల ముందు ఉంచుతున్నారు. ఆరిమిల్లి కేవ‌లం 2 వేల ఓట్లతోనే ఓడిపోవ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న టీడీపీ కేడ‌ర్ చెక్కుచెద‌ర‌కుండా చూసుకుంటున్నారు. నాగేశ్వర‌రావు ప్రజ‌ల‌ను క‌లిసి.. ప్రభుత్వ ప‌థ‌కాల‌పై వివ‌రించిన మ‌రునాడే రాధాకృష్ణ రంగంలోకి దిగి ఆయా ప‌థ‌కాల్లోని లొసుగుల‌ను ప్రజ‌ల‌కు వివరిస్తున్నారు. టీడీపీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేస్తున్నారు. ఎప్పటిక‌ప్పుడు నాయ‌కుల‌కు అందుబాటులో ఉంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా…..

చంద్రబాబు ఇచ్చే పిలుపు మేర‌కు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అధికార పార్టీపైకంటే.. కూడా ఎమ్మెల్యే కారుమూరిని టార్గెట్ చేయ‌డంలో రాధాకృష్ణ ముందున్నార‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే, కారుమూరి కూడా వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య నువ్వానేనా అనేరేంజ్‌లో రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఇక్కడ రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరీ పోరు సాగ‌డం ఖాయ‌మే. పశ్చిమ‌లో దెందులూరు, గోపాల‌పురం లాంటి టీడీపీ కంచుకోటల్లో వైసీపీకి వార్ వ‌న్‌సైడ్‌గా క‌నిపిస్తుంటే త‌ణుకులో మాత్రం అధికార పార్టీ పాగా వేయాలంటే చెమ‌టోడ్చక త‌ప్పదు. మొత్తానికి త‌ణుకులో రాజ‌కీయం కారుమూరి వ‌ర్సెస్ ఆరిమిల్లి మ‌ధ్య మ‌హా రంజుగా ఉంద‌నే చెప్పాలి.

Tags:    

Similar News