అక్కడ చంద్రబాబు ఆమె వైపు మొగ్గు చూపుతున్నారా?

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని ప‌రుగులు పెట్టించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఒక‌వైపు ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తూనే.. మ‌రోవైపు. పార్టీని కూడా గాడిలో పెడుతున్నారు. నిన్న మొన్నటి [more]

Update: 2021-07-03 00:30 GMT

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని ప‌రుగులు పెట్టించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఒక‌వైపు ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తూనే.. మ‌రోవైపు. పార్టీని కూడా గాడిలో పెడుతున్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు ఇంచార్జ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నారు. తిరువూరు, భీమిలి, మాచ‌ర్ల లాంటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా ఆయ‌న ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మిస్తూ వ‌స్తున్నారు. పార్టీ ఇన్‌చార్జ్‌లు లేక క‌ష్టాల్లో ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వ‌రుస పెట్టి అభ్యర్థుల‌ను నియ‌మిస్తోన్న చంద్రబాబు గుంటూరు జిల్లాలో పార్టీకి కంచుకోట‌గా ఉన్న స‌త్తెన‌ప‌ల్లి ఇన్‌చార్జ్‌ విష‌యంపై మాత్రం బాబు ఏమీ తేల్చలేదు. ఇక్క‌డ ఆయ‌న దాగుడు మూత‌లు ఆడుతున్నారా? లేక‌.. వేచి చూస్తున్నారా? అనే ప్రశ్నలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

రెండేళ్ల నుంచి…..

స‌త్తెనప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద‌రావు.. మ‌ర‌ణించారు. దీంతో ఇక్కడ పార్టీ ఏకాకిగా మారింది. అయితే.. ఈ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు ప్రస్తుతం ఇక్కడ న‌లుగురు నాయ‌కులు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. కోడెల త‌న‌యుడు డాక్టర్‌ శివ‌రామ కృష్ణ త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జ్ ప‌ద‌వి ఇవ్వాల‌ని కోరుతున్నారు. అయితే.. ఆయ‌న‌పై గ‌తంలో కొన్ని ఆరోప‌ణ‌లు ఉన్న నేప‌థ్యంలో చంద్రబాబు వెనుకాడుతున్నట్టు క‌నిపిస్తోంది. అలాగ‌ని కోడెల ఫ్యామిలీని ప‌క్కన పెట్టడం కూడా లేదు. అదే స‌మ‌యంలో టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు త‌న‌యుడు రాయ‌పాటి రంగారావు కూడా ఇక్కడ ప‌ద‌వి ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

నాయకత్వంపై నమ్మకం లేక…..

ఈయన విష‌యాన్ని కూడా చంద్రబాబు ప‌రిశీల‌న‌కు తీసుకోవ‌డం లేదు. నిజానికి ఈయ‌న నాయక‌త్వంపై అధినేత‌కు న‌మ్మకం ఉన్నా, వారి కుటుంబంలో ఇదే విష‌యంపై జ‌రుగుతున్న వివాదం నేప‌థ్యంలో చంద్రబాబు వెనుక‌డుగు వేస్తున్నట్టు క‌నిపిస్తోంది. ఇక‌, రాజ‌ధాని ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న రాయ‌పాటి కుటుంబానికి చెందిన శైల‌జ ఇక్కడి బాధ్యత‌లు చూస్తాన‌ని అంటున్నట్టు స‌మాచారం. ఈ క్రమంలోనే రంగారావు విష‌యంలో నిర్ణయం తీసుకోవ‌డం లేదంటున్నారు.

బలమైన వర్గం ఉండటంతో….

స‌త్తెన‌ప‌ల్లిలో రాయ‌పాటి ఫ్యామిలీకి బ‌ల‌మైన వ‌ర్గం ఉంది. ఇక రాజ‌ధాని ఉద్యమంలో శైల‌జ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. మ‌రోవైపు మాజీ ఎమ్మెల్మే వై. ఆంజ‌నేయులు ఇటీవ‌ల కాలంలో ఇక్కడ క్రియాశీల‌కంగా తిరుగుతున్నారు. చ‌ల‌ప‌లి విద్యాసంస్థల అధినేత‌గా ఉన్న ఆయ‌న 1999లోనే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. త‌న‌కు బాధ్యత‌లు అప్పచెపితే వ‌చ్చే ఎన్నిక‌ల్లోటీడీపీ జెండా ఇక్కడ ఎగుర‌వేస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇలా స‌త్తెన‌ప‌ల్లిలో టీడీపీ ప‌రిస్థితి నాలుగు స్తంభాల‌ట‌గా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News