సీమలో ఆ సైలెన్స్ ఎందుకో?

తెలుగుదేశం పార్టీ రాయలసీమలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. దీనికి తోడు ఇప్పుడు నీటి వివాదం ఆ పార్టీని మరింత ఇబ్బంది పెట్టేవిధంగా మారింది. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ [more]

Update: 2021-07-12 11:00 GMT

తెలుగుదేశం పార్టీ రాయలసీమలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. దీనికి తోడు ఇప్పుడు నీటి వివాదం ఆ పార్టీని మరింత ఇబ్బంది పెట్టేవిధంగా మారింది. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ గత ఏడేళ్లుగా బలహీనంగా ఉంది. 2014 ఎన్నికల్లోనూ పెద్దగా ఇక్కడ ఫలితాలు దక్కలేదు. 2019లో జరిగిన ఎన్నికల్లో అయితే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి దక్కింది కేవలం మూడు సీట్లే. అవి చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ లు మాత్రమే గెలిచారు.

బలమైన నేతలున్నా….

రాయలసీీమలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలున్నారు. పేరున్న నేతలే పదుల సంఖ్యలో ఉన్నారు. సుదీర్ఘకాలం నుంచి వారు రాజకీయాల్లో ఉన్నవారే. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలి బండ వివాదాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆ ప్రాంతానికి సాగు, తాగు నీటి సమస్య చాలా వరకు తీరుతుంది. అయితే ఇది పూర్తయితే క్రెడిట్ మొత్తం జగన్ కే దక్కుతుంది.

వివాదం మరింత…..

ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం మరింత ముదురుతుంది. ఇది వైసీపీకి అడ్వాంటేజీగా మారుతుంది. వైసీపీ రాయలసీమ నేతలంతా గొంతెత్తుకుని అరుస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఈ వివాదం పై నోరు మెదపడం లేదు. తమ ప్రాంతానికి దక్కుతున్న ప్రయోజనాన్ని అడ్డుకుంటున్న తెలంగాణ ప్రభుత్వంపై ఏమీ అనలేకపోతున్నారు. ఈ వివాదంపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించడమే కారణం.

ఇద్దరి గేమ్…..

ఈ వివాదం కేసీఆర్, జగన్ లు సృష్టించినవేనన్నది చంద్రబాబు నమ్మకం. తమను మరింత బలహీన పర్చేందుకు వారిద్దరూ ఆడుతున్న గేమ్ గా చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే ఈ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబు కొంత కటువుగానే నేతలకు చెప్పారట. దీంతో రాయలసీమ తెలుగుదేశం నేతలు ఈ వివాదంపై మౌనంగానే ఉన్నారు. ఇది తమకు భవిష‌్యత్ లో నష్టం చేకూరుస్తుందని వారు చెబుతున్నారు.

Tags:    

Similar News