అక్కడ పార్టీగానే టీడీపీ ?

టీడీపీని జాతీయ పార్టీ అని తమ్ముళ్ళు అంటారు. జాతి పార్టీ అని వైసీపీ అంటుంది. అసలు నిజానికి టీడీపీ ఎక్కడ ఉంది అంటే మాత్రం కోస్తా జిల్లాల్లోనే [more]

Update: 2020-11-02 15:30 GMT

టీడీపీని జాతీయ పార్టీ అని తమ్ముళ్ళు అంటారు. జాతి పార్టీ అని వైసీపీ అంటుంది. అసలు నిజానికి టీడీపీ ఎక్కడ ఉంది అంటే మాత్రం కోస్తా జిల్లాల్లోనే కాసింత బలంగా ఉనికిని చాటుకుంటోందని చెప్పాలేమో. టేడీపీ పుట్టిన తెలంగాణాలో బోర్డు ఏనాడో తిరగేశారు. అక్కడ 2018 ఎన్నికల తరువాత ఏకంగా ఆశలన్నీ వదిలేసుకుని ఆంధ్రాకు వచ్చేశారనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఆంధ్రా కూడా పెద్ద దెబ్బ కొట్టేసింది. ఎన్నికలు జరిగి ఏడాదిన్నరకు పైన అయింది, కానీ ఏపీలో టీడీపీ ఎక్కడా బలపడుతున్న సూచనలు మాత్రం లేవు అని క్యాడరే దిగాలు అవుతోంది. ఏపీలో ఉత్తరాంధ్రా, కోస్తా, రాయలసీమ అని మూడు కీలకమైన ప్రాంతాలు ఉంటే ఇపుడు కోస్తాలోనే టీడీపీ కొంచెం ఊపిరి తీసుకుంటోంది.

సీమలో చితికిందిగా…?

రాయలసీమకు చెందిన చంద్రబాబునాయుడు ఏలుబడిలో టీడీపీకి అక్కడే నూకలు చెల్లడం దారుణం. 2019 ఎన్నికలో రాయలసీమ నాలుగు జిల్లల్లోని 52 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం మూడంటే మూడు సీట్లు పార్టీ గెలిచింది. ఇపుడు చూస్తే ఆ మూడు సీట్లలో కూడా కొంత ప్రతికూల వాతావరణం పార్టీలో ఉంది. చంద్రబాబు కుప్పంలో గతసారి 30 వేలకు మెజారిటీ దిగిపోయి గెలిచారు. బాబు కుప్పం నియోజకవర్గంలో బీసీలు గట్టి సవాల్ చేస్తున్నారు. బాబు గెలిచాక పెద్దగా కుప్పానికి పోయిన దాఖలాలు అయితే లేవు. ఇక హిందూపురంలో బాలయ్య గెలిచారు. ఆయన సైతం సినిమాలు షూటింగులు అంటూ తనను గెలిపించిన ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో మరో సీటు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనే పయ్యావుల కేశవ్. ఆయనకు చంద్రబాబు ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా కూడా ఉలకడంలేదు, పలకడంలేదు. దాంతో ఇక్కడ కూడా పచ్చదనం కరిగిపోతోంది. ఓడిన సీట్ల విషయం అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు అంటున్నారు.

పరిటాల ఫ్యామిలీ సైలెంట్….

అనంతపురం జిల్లాకే పెద్ద నాయకులుగా చెప్పుకునే పరిటాల ఫ్యామిలీ ఫుల్ సైలెంట్ అయింది. వారికి ఈ జిల్లాలో సగం బలం ఉందని చంద్రబాబు నమ్ముతారు. కానీ వారు మాత్రం అసలు రాజకీయాన్నే నమ్ముకోకుండా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పరిటాల రవీంద్ర వారసుడిగా తొలిసారి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కుమారుడు పరిటాల శ్రీరాం ఘోరంగా ఓటమి పాలు అయ్యారు. దాంతో వారి కుటుంబం పూర్తి నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది. జేసీ సోదరులు కూడా వరస దెబ్బలతో డల్ అయ్యారు. దీంతో ఈ మధ్య జిల్లాలో వరదలపైన లోకేష్ టూర్ చేస్తే టీడీపీ నేతల్లో హుషార్ కూడా కనిపించలేదు. ఎక్కడివారు అక్కడ గప్ చుప్ అయిపొయారు.

అక్కడికే పరిమితమా …?

ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాలు వైసీపీ గొడుగు కిందకు ఏనాడో చేరాయి. ఇక్కడ వైసీపీకే రాజకీయంగా గట్టి పట్టుంది. దానికి తోడు ఉత్తరాంధ్రాలో కూడా పాగా వేయడానికి వైసీపీ తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో క్రిష్ణ గుంటూర్, ఉభయ గోదావరి జిల్లాల పార్టీగా మాత్రమే టీడీపీ ఇపుడు కనిపిస్తోంది అంటున్నారు. పసుపు నాయకుల సౌండ్ కూడా ఇక్కడ నుంచే కాస్తా ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఈ నాలుగు జిల్లాల్లో డెబ్బై సీట్లకు పైగా ఉన్నాయనుకున్నా వీటిలో కూడా ఎన్ని సీట్లు టీడీపీ గెలుస్తుంది. ఎపుడు అధికారంలోకి వస్తుంది అన్నది అతి పెద్ద ప్రశ్నగా ఉంది. మొత్తానికి టీడీపీ ఏపీవ్యాప్తంగా కూడా తన ఉనికిని చాటుకోలేకపోవడం అతి పెద్ద ప్రమాదానికి సంకేతం అంటున్నారు.

Tags:    

Similar News