tdp : ప్చ్‌… టీడీపీ మళ్ళీ ఆ సీటు లాస్ అవ్వాల్సిందేనా…?

ఏపీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ద‌మ్మున్న నేతలు లేక‌పోవ‌డంతో జెండా ప‌ట్టుకుని న‌లుగురు కార్యక‌ర్తల‌ను న‌డిపించే వారే గ‌త‌వుతున్నారు. ఈ క్రమంలోనే మ‌రో నేత‌కు కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో [more]

Update: 2021-10-05 15:30 GMT

ఏపీలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ద‌మ్మున్న నేతలు లేక‌పోవ‌డంతో జెండా ప‌ట్టుకుని న‌లుగురు కార్యక‌ర్తల‌ను న‌డిపించే వారే గ‌త‌వుతున్నారు. ఈ క్రమంలోనే మ‌రో నేత‌కు కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బాధ్యత‌లు ఇచ్చినా సైకిల్ పొడ‌పాము న‌డ‌క‌ను త‌ల‌పిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం….మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి పెద్దగా అనుకూలంగా లేని నియోజకవర్గం. ఇక్కడ పార్టీ బట్టి కాకుండా వ్యక్తుల బట్టి విజయాలు నమోదయ్యేవి.

రెండుసార్లు మాత్రమే…

పార్టీ పెట్టిన మొదట్లో రెండు సార్లు టీడీపీ ఇక్కడ గెలిచింది. 1983, 1985 ఎన్నికల్లో టి‌డి‌పి జెండా ఎగిరింది. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున రాజ్యస‌భ స‌భ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గెలిచారు. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజ‌నం వీచినా కూడా తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్‌గా గెలవగా, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో పిల్లి, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2012 ఉపఎన్నికలో తోట కాంగ్రెస్ నుంచి, 2014లో పార్టీ మారి టీడి‌పి నుంచి గెలిచారు.

దిక్కులేకుండా పోయిందే?

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన చెల్లుబోయిన వేణు మంత్రి అయ్యారు. ఆ త‌ర్వాత ఇక్కడ రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ప్ర‌త్యర్థులు వైసీపీలోనే ఉన్నారు. పిల్లి రాజ్యసభ సభ్యుడుగా ఉంటే, తోట ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే తోట…మండపేట బాధ్యతలు చూసుకుంటున్నారు. తోట టీడీపీని వదిలాక రామచంద్రాపురంలో ఆ పార్టీకి సరైన దిక్కు లేకుండా పోయింది. ఇక్కడ పార్టీ క్యాడర్ చెల్లాచెదురైపోయింది.

ఎక్కడి నుంచో తీసుకువచ్చి…

తోట ఇక్కడ ప‌లుసార్లు పార్టీలు మారినా చంద్రబాబు ఆయ‌న‌కే టీడీపీ పగ్గాలు ఇస్తూ రావ‌డంతో ఇక్కడ తోట బ‌ల‌ప‌డి.. పార్టీ డ‌మ్మీ అయ్యింది. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్నట్టుగా ఇప్పుడు అక్కడ‌ టీడీపీ ఇంచార్జ్‌గా రెడ్డి సుబ్రహ్మణంని పెట్టారు. అసలు ఈయనకు ఇక్కడ పెద్ద ఫాలోయింగ్ లేదు. చెల్లుబోయిన వేణుగోపాల్‌కు ధీటుగా రెడ్డి సుబ్రహ్మణ్యం నిలబడటం చాలా కష్టమని పార్టీ నేత‌లే చెపుతున్నారు. అక్కడ వైసీపీలో కీల‌క నేత‌లుగా ఉన్న ముగ్గురిలో ఏ ఒక్కరికి కూడా రెడ్డి స‌రైన పోటీ దారు కాదు. ఎక్కడో రావుల‌పాలెంకు చెందిన ఆయ‌న‌కు చంద్రబాబు 2009లో గ‌తిలేక సీటు ఇచ్చారు. ఇక ఇప్పుడు కూడా మ‌ళ్లీ అక్కడ ఎవ్వరూ గ‌తిలేక‌పోవ‌డంతోనూ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇచ్చారు. అంత‌కుమించి ఆయ‌న‌తో అక్కడ పార్టీకి ఒరిగేదేం లేదు.

Tags:    

Similar News