కలసినా…కలసి రాలేదే

రాజుల క‌లిశారు. నిన్న మొన్నటి వ‌ర‌కు ఎవ‌రి ఆధిప‌త్యం వారిది అన్నట్టుగా ఉన్న వారంతా ఒక్క తాటిపైకి వ‌చ్చారు. టీడీపీఅధినేత సూచ‌న‌లు, స‌ల‌హాల మేర‌కు వారంతా ఒకే [more]

Update: 2019-08-15 06:30 GMT

రాజుల క‌లిశారు. నిన్న మొన్నటి వ‌ర‌కు ఎవ‌రి ఆధిప‌త్యం వారిది అన్నట్టుగా ఉన్న వారంతా ఒక్క తాటిపైకి వ‌చ్చారు. టీడీపీఅధినేత సూచ‌న‌లు, స‌ల‌హాల మేర‌కు వారంతా ఒకే లైన్‌లోకి వ‌చ్చారు. విప‌రీతంగా ప్రచారం చేశారు. అయినా.. రాజ్యాల‌ను (నియోజ‌క‌వ‌ర్గాల‌ను) పోగొట్టుకున్నారు. వారే ఉత్తరాంధ్రలోని కీల‌క‌మైన జిల్లా విజ‌య‌నగ‌రానికి చెందిన అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, బొబ్బిలిరాజు సుజ‌య కృష్ణ రంగారావు, కురుపాం రాజులు. వీరంతా నిన్నమొన్నటి వ‌రకు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. అయితే, మ‌రోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల‌నిభావించిన చంద్రబాబు వీరిని ఏక‌తాటిపైకి తెచ్చారు.

అంతా ఒక్కటయినా….

అస‌లు విజ‌య‌న‌గ‌ర రాజుల‌కు, బొబ్బిలి రాజుల‌కు శ‌తాబ్దాలుగా ప‌డ‌దు. కురుపాం రాజుల‌కు విజ‌య‌న‌గ‌ర రాజుల‌కు కూడా పొసిగేది కాదు. వీరందరినీ చంద్రబాబు ఒక్కటి చేశారు. ఈ క్రమంలోనే వారంతా తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే, జ‌గ‌న్ సునామీని మాత్రం వీరి వ్యూహాలు త‌ట్టుకోలేక పోయాయి. దీంతో జిల్లాలోని 9 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీ విజ‌యం సాధించింది. దీంతో ఇప్పుడు వీరు ఏం చేయాలి? అనే స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చింది. వీరిలో అశోక్‌గ‌జ‌ప‌తి రాజు ప‌రిస్థితి దారుణంగాత‌యారైంది. ఆయ‌న కుమార్తెను రాజ‌కీయ వార‌సురాలిగా ప్రక‌టించి ఆయ‌న పోటీ కూడా చేయించారు. అయితే, ఆమె కూడా ప‌రాజ‌యం పాలైంది. వ‌య‌సు రీత్యా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో ఈఫ్యామిలీ దాదాపు రాజ‌కీయాల‌కు దూర‌మే అనే మాట వినిపిస్తోంది.

బయటకు రాలేక….

దాదాపు ఆరేడు ద‌శాబ్దాలుగా తెలుగు గ‌డ్డపై రాజ‌కీయాలు చేస్తూ వ‌స్తోన్న అశోక్ ఫ్యామిలీకి ఈ ఎన్నిక‌లు శ‌రాఘాతంగా మారిపోయాయి. ఇంత చ‌రిత్ర ఉన్నా ఇప్పుడు రాజ‌కీయాల్లో కొన‌సాగే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇక‌, వైసీపీలో గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న బొబ్బిలి రాజు, మాజీ మంత్రి సుజ‌య ను కూడా ప్రజలు తాజాగా ఓడించారు. దీంతో ఆయ‌న ఈ ఓట‌మి నుంచి ఇప్పటికీ బ‌య‌ట‌కు రాలేక పోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడు బేబినాయ‌న‌ను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నట్టు స‌మ‌చారం.

సేమ్ టు సేమ్…

ఇక కురుపాం రాజవంశీయుడు మాజీ కేంద్ర మంత్రి వైరిచ‌ర్ల కిషోర్ చంద్రదేవ్‌ది కూడా సేమ్ టు సేమ్ పొజిష‌న్‌.ఈ ఎన్నిక‌ల్లో అర‌కు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా నాలుగు ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న ఆయ‌న కూడా నిష్క్రమించ‌నున్నారు. ఇక మ‌రో సీనియ‌ర్ నేత ప‌తివాడ నారాయ‌ణ స్వామి కూడా వ‌యో వృద్ధుడు కావ‌డంతో పార్టీలో ఆయ‌న పాత్ర కూడా త‌గ్గిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న త‌ప్పుకొని ఆయ‌న వార‌సుడిని రంగంలోకి దింపుతాడా? మ‌రేం జ‌రుగుతుంద‌నే ప్రశ్న తెర‌మీదికి వ‌స్తోంది. కీల‌క నేత‌లు రాజ‌కీయాల‌కు దూర‌మైపోవ‌డంతో ఇప్పుడు విజ‌య‌న‌గ‌రంలో పార్టీని ప‌ట్టించుకునే నాథుడే క‌నిపించ‌డం లేదు. దీంతో టీడీపీలో గంద‌ర‌గోళ‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News