Tdp : టీడీపీ హ్యాట్రిక్ ఓటమి… నాలుగోసారైనా గెలుస్తుందా?

పామర్రు నియోజకవర్గంలో టీడీపీకి గత కొన్నాళ్లుగా ఇన్ ఛార్జులు లేక క్యాడర్ ఇబ్బంది పడుతుంది. ఎట్టకేలకు చంద్రబాబు ఇన్ ఛార్జిని నియమించారు. వర్ల కుటుంబానికే పదవి ఇచ్చారు. [more]

Update: 2021-10-16 12:30 GMT

పామర్రు నియోజకవర్గంలో టీడీపీకి గత కొన్నాళ్లుగా ఇన్ ఛార్జులు లేక క్యాడర్ ఇబ్బంది పడుతుంది. ఎట్టకేలకు చంద్రబాబు ఇన్ ఛార్జిని నియమించారు. వర్ల కుటుంబానికే పదవి ఇచ్చారు. వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజాను ఇన్ ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కల్పనను పూర్తిగా ఇక పక్కన పెట్టినట్లే. పామర్రు నియోజకవర్గం చంద్రబాబుకు ప్రతిష్టాత్మకం.

ఎన్టీఆర్ సొంత గ్రామం….

ఇది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత గ్రామమైన నిమ్మకూరు ఉన్న నియోజకవర్గం. 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో పామర్రు ఏర్పడింది. 2009 నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారిగా కూడా టీడీపీ విజయం సాధించలేదు. మూడు ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు వైసీపీ విజయం సాధించింది. 2014లో వైసీపీ తరుపున గెలిచిన ఉప్పులేటి కల్పనను ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పార్టీలో చేర్చుకున్నారు.

దారుణ ఓటమితో…

2019లో కూడా ఇక్కడ టీడీపీ తరుపున ఉప్పులేటి కల్పన పోటీ చేసి దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇక్కడ నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కైలా అనిల్ కుమార్ విజయం సాధించారు. ఇక్కడ నేతల కంటే పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉప్పులేటి కల్పన నియోజకవర్గంలో పార్టీని పట్టించుకోవడం లేదు. పార్టీ కార్యక్రమాలను కూడా చేపట్టడం లేదు. చంద్రబాబు పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేదు.

వర్ల కుమారుడికి….

ఈ పరిస్థితుల్లో వర్ల కుమార్ రాజాను చంద్రబాబు ఇన్ ఛార్జిగా నియమించారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వర్ల కుటుంబానికే టిక్కెట్ అనిచెప్పకనే చెప్పారు. గతంలోనూ వర్ల రామయ్య పామర్రు నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించారు. చంద్రబాబు 2014 లో టిక్కెట్ ఇచ్చినా వర్ల రామయ్య కు స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆయన కుటుంబానికే 2024 టిక్కెట్ ఖాయమని తేల్చారు. వర్లను రాష్ట్ర రాజకీయాల్లో ఉపయోగించుకుని, ఆయన కుమారుడిని ఎన్నికల్లో పోటీకి దింపాలన్నది చంద్రబాబు ఆలోచన. మరి ఈసారి అయినా టీడీపీ ఈ నియోజకవర్గంలో గెలుస్తుందా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News