హేమిటో… ఇది వీళ్లు ఇలా అయిపోయారేమిటి?

అధికారంలో లేనప్పుడే తమ పనితీరును చాటుకోవాల్సి ఉంటుంది. ప్రజల పక్షాన నిలవాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరోసారి గెలిచేందుకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. కానీ ఎన్నికలు [more]

Update: 2020-11-06 09:30 GMT

అధికారంలో లేనప్పుడే తమ పనితీరును చాటుకోవాల్సి ఉంటుంది. ప్రజల పక్షాన నిలవాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరోసారి గెలిచేందుకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. కానీ ఎన్నికలు జరిగి పద్ధెనిమిది నెలలు కావస్తున్నా టీడీపీ నేతల్లో చలనం లేదు. అసలు వారు పార్టీలో ఉన్నారా? లేదా? అన్నది కూడా అర్ధం కాకుండా ఉంది. అధినేత చంద్రబాబుకు కూడా వీరి వ్యవహార శైలి అంతుపట్టడం లేదు.

పూర్తిగా సైలెంట్….

కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో ఒకరిద్దరు టీడీపీ నేతలు యాక్టివ్ గా ఉన్నా కర్నూలు జిల్లాలో మాత్రం మొత్తానికి మొత్తం కాడిని వదిలేసినట్లు కనపడుతుంది. ఈ మధ్య పార్టీ పదవులను భర్తీ చేసినప్పటికీ వీరు యాక్టివ్ గా లేకపోవడం టీడీపీలో చర్చనీయాంశమైంది. అసలు వీళ్లకు ఏమయింది? అన్న సందేహాలు కలుగుతున్నాయి. సొంత పార్టీపై అసంతృప్తా? అధికార పార్టీకి భయపడి పెదవి విప్పడం లేదా? అన్న చర్చ జరుగుతోంది.

పత్తా లేకుండా పోయారే?

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇక నామినేటెడ్ పోస్టులకు లెక్కేలేదు. ఆ ఎన్నికల్లోనూ కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలవడంతో పార్టీని పటిష్టం చేయడానికి చంద్రబాబు పదవులను ఇచ్చారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. పవర్ ను అనుభవించిన నేతలు నేడు పత్తా లేకుండా పోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడంతో నేతలందరూ డీలా పడిపోయారు.

హేమాహేమీలున్నా…..

కర్నూలు జిల్లా టీడీపీలో హేమాహేమీలు ఉన్నారు. కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, భూమా అఖిలప్రియ, బీసీ జనార్థన్ రెడ్డి, టజీ భరత్, మీనాక్షినాయుడు వంటి నేతలు ఉన్నప్పటికీ వారు పెదవి విప్పడం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. తమ నియోజకవర్గాల్లో కూడా కొందరు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కర్నూలు జిల్లా నేతలను యాక్టివ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పైనే ఉంది. లేకుంటే క్యాడర్ మరింత డీలా పడే అవకాశముంది.

Tags:    

Similar News