ఆందోళనకరమేనటగా

కృష్ణా జిల్లా టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు, అన్నగారు ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలో టీడీపీ ఇప్పుడు ఏ ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది? మున్ముందు టీడీపీకి [more]

Update: 2019-11-28 06:30 GMT

కృష్ణా జిల్లా టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్యక్షుడు, అన్నగారు ఎన్టీఆర్ పుట్టిన జిల్లాలో టీడీపీ ఇప్పుడు ఏ ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది? మున్ముందు టీడీపీకి ఇక్కడ ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతోంది? ఇప్ప డు ఇదే ఇక్కడ ఆస‌క్తిక‌ర చ‌ర్చగా సాగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. 2014లో పార్టీ ప‌రిస్థితి చాలా ఆశాజనకం. భారీ స్థానాల్లో విజ‌యం సాధించి ప‌సుపు కోట‌గా మారింది. పామ‌ర్రు, గుడివాడ‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, తిరువూరు, నూజివీడు మిన‌హా.. మిగిలిన స్థానాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే, త‌ర్వాత చేసిన ఆపరేష‌న్ ఆక‌ర్ష్‌లో భాగంగా పామ‌ర్రు, విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యేల‌ను చంద్రబాబు త‌న ఖాతాలో వేసుకు న్నారు.

అంటీముట్టనట్లు…..

దీంతో ఇక‌, ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు ఈ జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ ఖాయ‌మ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. కానీ, అనూహ్యంగా ఇక్కడ వైసీపీ పుంజుకుంది. కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌న్న వరం, విజ‌య‌వాడ తూర్పు మిన‌హా మిగిలిన చోట్ల వైసీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. దీంతో ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంద‌నే విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. కీల‌క‌మైన నాయ‌కులు ప్రస్తుతం టీడీపీకి దూరంగా ఉంటున్నారు. కొంద‌రు పార్టీలోనే ఉన్నా.. అంటీ ముట్టన‌ట్టు వ్యవ‌హ‌రిస్తున్నారు. మ‌రికొంద‌రు.. పార్టీకి దూరం అయ్యేందుకు రెడీ అవుతున్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఓడిపోయిన నేతలు….

అవ‌నిగ‌డ్డ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ డిప్యూటీ స్పీక‌ర్ బుద్ద ప్రసాద్ కాడి వ‌దిలేశారు. పార్టీలో ఆయ‌న ఎక్కడా వాయిస్ వినిపించ‌క‌పోగా, కార్యక్రమాల‌కూ దూరంగా ఉంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న వీఆర్ఎస్ తీసుకుంటార‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఇక‌, పామ‌ర్రులో టీడీపీ జెండా మోసిన మాజీ వైసీపీ నాయ‌కురాలు ఉప్పులేటి క‌ల్పన కూడా ఇప్పుడు పార్టీని ప‌ట్టించుకోడం లేదు. చంద్రబాబు ఇస్తున్న నిర‌స‌న పిలుపుల‌కు కూడా ఆమె స్పందించ‌డం లేదు. ఆమె రాజ‌కీయాల‌కు దూర‌మే అంటున్నారు. ఇక‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన జ‌లీల్ ఖాన్ ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌న కుమార్తె ష‌బానా ఖ‌తూన్‌ను రంగంలోకిదింపినా.. ఓడిపోయింది.

పాత పరిచయాలను అడ్డంపెట్టుకుని…..

దీంతో ఖ‌తూన్ వెంట‌నే అమెరికాకు వెళ్లిపోవ‌డం, అనారోగ్య కార‌ణాల‌తో జ‌లీల్ పార్టీకి దూరంగా ఉండ‌డం తెలిసిందే. ఆయ‌న తిరిగి వైసీపీలోకి వెళ్లిపోతార‌ని కూడా అంటున్నారు. ఇక‌, తూర్పున గెలిచిన గ‌ద్దె రామ్మోహ‌న్ త‌న ప‌నితాను చూసుకుంటున్నారే త‌ప్ప యాక్టివ్‌గా లేరు. అదే స‌మ‌యంలో విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్త నేత‌గానే కొన‌సాగుతున్నారు. కొన్ని కార్యక్రమాల్లో ఉంటున్నారు. మ‌రిన్ని కార్యక్రమాల‌కు డుమ్మా కొడుతున్నారు. ఇక‌, పెన‌మ‌లూరులో ఓడిన బోడే ప్రసాద్ యాక్టివ్‌గానే ఉన్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపుల‌ను ఆయ‌న మెయిన్ టెయిన్ చేయ‌లేక పోతున్నారు. దీంతో టీడీపీ పెద్దగా యాక్టివ్ రోల్ పోషించ‌డం లేదు. ఇక‌, నూజివీడులో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముద్దర‌బోయిన వెంక‌టేశ్వర‌రావు.. త‌న పాత ప‌రిచ‌యాల‌ను అడ్డు పెట్టుకుని వైసీపీలోకి జంప్ చేయాల‌ని చూస్తున్నారు.

దీనస్థితికి దిగజారి….

కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి.. జ‌య‌మంగ‌ళ వెంక‌ట ర‌మ‌ణ‌.. ఎలాగూ ఓడే స‌మ‌యంలోనే త‌న‌కు టికెట్ ఇచ్చార‌ని అల‌క వ‌హించారు. దీంతో ఆయ‌న కూడా ఎక్కడా క‌నిపించ‌డం లేదు. మ‌చిలీప‌ట్నం ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌.. ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. త‌న‌కు ఎంపీ సీటు వ‌ద్దు.. పెడ‌న ఇంచార్జ్ కావాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. ఇక‌, విజ‌య‌వాడ సెంట్రల్‌లో కేవ‌లం 25 ఓట్లతో ఓడిన బొండా ఉమా.. కొన్నాళ్లు ఊగిస లాడినా.. మ‌ళ్లీ టీడీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అయితే, ఇది ఎన్నాళ్లనేది కూడా డౌటేనంటున్నారు త‌మ్ముళ్లు. ఇక‌, గ‌న్నవ‌రం ప‌రిస్థితి చెప్పక్క‌ర్లేదు. ఇక్కడ నుంచి గెలిచిన వంశీ బాబుపై తీవ్ర విమ‌ర్శలు చేసి వైసీపీకి మ‌ద్దతిస్తాన‌ని చెప్పారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ గుడివాడ‌లో ఓడిన అవినాష్ ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారు. అస‌లు అక్కడ పార్టీ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. సో.. మొత్తంగా కృష్ణాలో టీడీపీ ప‌రిస్థితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి.. అన్నచందంగా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ కంచుకోట‌లో ఎప్పుడూ లేనంత దీన‌స్థితికి టీడీపీ దిగ‌జారింది.

Tags:    

Similar News