రాంగ్ స్టెప్ ను వెనక్కు తీసుకోలేకపోతున్నారా?

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి గ‌ట్టి ప‌ట్టు, మంచి ఓటు బ్యాంకు ఉన్న ప‌శ్చిమ గోదావ‌రిలోని కీలక‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కొవ్వూరు. ఇక్కడ టీడీపీ రెండుసార్లు మిన‌హా అన్నిసార్లు [more]

Update: 2020-01-07 00:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి గ‌ట్టి ప‌ట్టు, మంచి ఓటు బ్యాంకు ఉన్న ప‌శ్చిమ గోదావ‌రిలోని కీలక‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కొవ్వూరు. ఇక్కడ టీడీపీ రెండుసార్లు మిన‌హా అన్నిసార్లు గెలుపు గుర్రం ఎక్కింది. పోటీలో ఎవ‌రున్నార‌నే లెక్క ప‌క్క న పెట్టి ఇక్కడి ప్రజ‌లు టీడీపీకి బ్రహ్మ ర‌థం ప‌ట్టారు. అయితే, ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్రబాబు వేసిన ఒకే ఒక్క రాంగ్ స్టెప్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో అంటే 2014లో ఇక్కడ మాజీ మంత్రి కేఎస్‌. జ‌వ‌హ‌ర్‌ను నిల‌బెట్టారు. ఆయ‌న స్థానికేత‌రుడ‌న్న ప్రచారం జ‌రిగింది. అయినా టీడీపీపై ఉన్న అభిమానంతో ప్రజ‌లు ఆయ‌న‌కు ప‌ట్టం క‌ట్టారు. అయితే, కేడ‌ర్‌ను న‌డిపించ‌డంలో ఆయ‌న విఫ‌ల‌మ‌య్యారు.

ఒక వర్గానికి….

కేవ‌లం ఒక వ‌ర్గానికి నాయ‌కుడ‌నే ముద్రను వేసుకున్నారు. మంత్రి అయ్యాక ఈ విమ‌ర్శలు మ‌రింత‌గా జ‌వ హర్‌పై పెరిగిపోయాయి. చివ‌రి రెండేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌వ‌హ‌ర్ వ‌ర్గం, జ‌వ‌హ‌ర్ వ్యతిరేక వ‌ర్గం నేత‌లు బాహాబాహీకి దిగ‌డంతో పాటు కొట్టుకున్నారు. ఈ స‌మ‌యంలోనే చంద్రబాబు క‌లుగ‌జేసుకుని ప‌రిస్థితిని చ‌క్కదిద్ది ఉంటే ప్రయోజ‌న ఉండి ఉండేది. అయితే, ఆయ‌న ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా మౌనం పాటించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ విశాఖ జిల్లా పాయ‌కారావుపేట నుంచి వంగ‌ల‌పూడి అనిత‌ను తీసుకువ‌చ్చి ఇక్కడ టికెట్ ఇచ్చారు. అప్పటికే స్థానికేత‌రుల‌కు టికెట్ ఇవ్వొద్దన డిమాండ్ ఉన్న నేప‌థ్యంలో అనిత‌ను ఇక్కడ నిల‌బెట్టడం పార్టీలోని సీనియ‌ర్లకు మ‌రింత ఆగ్రహం తెచ్చింది.

ఓటమి తర్వాత…..

దీంతో కొవ్వూరు రాజ‌కీయాల్లో నాన్ లోక‌ల్ అన్న అంశం గ‌త కొన్ని సంవత్సరాలుగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటు టీడీపీ గొడ‌వ‌లు… జ‌గ‌న్ వేవ్‌తో క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా ఇక్కడ వైసీపీ విజ‌యం సాధించింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కొవ్వూరులో ఓడిపోయిన నేప‌థ్యంలో తాను ఇక్కడ ఉండేది లేద‌ని త‌న పాత నియోజక వ‌ర్గం పాయ‌క‌రావుపేట‌లోనే ఉంటాన‌ని స్పష్టం చేస్తూ.. అనిత అక్కడ‌కు వెళ్లిపోయారు. అస‌లు కొవ్వూరు వైపే ఆమె కన్నెత్తి చూడడం లేదు. కేడ‌ర్‌ను గాలికి వ‌దిలేశారు.

నిర్ణయం తీసుకోకపోవడంతో…..

ఇక గెలిచి మంత్రిగా ఉన్న జ‌వ‌హ‌ర్ ను తిరువూరు కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయడం, అక్కడ ఆయ‌న ఓట‌మి పాల‌వ‌డం, తిరిగి కొవ్వూరుకే వ‌స్తాన‌ని ఆయ‌న చెప్పినా.. అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ లేక‌పోవ‌డంతో ఇప్పుడు కొవ్వూరులో పార్టీని న‌డిపించే ఇంచార్జ్ పోస్టు ఖాళీగా ఉండిపోయింది. దీంతో కిందిస్థాయి నాయ‌కులు, కార్యక‌ర్తలు డోలాయ‌మానంలో ప‌డుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ రాజ‌కీయాల‌ను శాసించే అచ్చిబాబు, యువ‌నేత విక్రమాదిత్యతో పాటు జ‌వ‌హ‌ర్ వ‌ర్గం నేత‌గా ముద్రప‌డ్డ జొన్నల‌గ‌డ్డ సుబ్బరాయ చౌద‌రి సైతం పార్టీ వ్యవ‌హారాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రి ఇప్పటికైనా చంద్రబాబు కొవ్వూరులో టీడీపీని గాడిలో పెడ‌తారా ? ఇన్‌చార్జ్‌గా ఎవ‌రిని నియ‌మిస్తారో ? చూడాలి.

Tags:    

Similar News