Tdp : చేరింది వంద మంది… బిల్డప్ మాత్రం…?

తెలుగుదేశం పార్టీ పరిస్థిితిని చూస్తే నవ్వొస్తుంది. పార్టీలో ఉన్న నేతలే పనిచేయడం లేదు. కొంత పట్టున్న నేతలు అవకాశమొస్తే జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో [more]

Update: 2021-10-10 00:30 GMT

తెలుగుదేశం పార్టీ పరిస్థిితిని చూస్తే నవ్వొస్తుంది. పార్టీలో ఉన్న నేతలే పనిచేయడం లేదు. కొంత పట్టున్న నేతలు అవకాశమొస్తే జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చేరికలు ఎలా ఉంటాయి. ఒకవైపు వైసీపీ బలంగా ఉన్న సమయంలో చేరికలు లేక అవస్థలు పడుతుంది తెలుగుదేశం. ఈ పరిస్థితుల్లో చోటా మోటా నేతలను చేర్చుకుని టీడీపీ బలపడుతోందన్న భ్రమలను కల్పించడానికి ఎల్లో మీడియా తాపత్రయపడుతుంది.

బడా నేతలు చేరుతున్నట్లు….

రెండు రోజుల క్రితం కనిగిరి నుంచి కొందరు టీడీపీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. నిజమే రెడ్డి సామాజికవర్గం నేతలు అసంతృప్తితో టీడీపీలో చేరారరని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. నిజానికి చేరింది కమ్మ సామాజికవర్గం నేత అయిన మాల్యాద్రి చౌదరి నాయకత్వంలోనే. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఇరిగినేని తిరుపతి నాయుడుకు మాల్యాద్రి అనుచరుడిగా ఉండేవారు. కనిగిరి నియోజకవర్గం మొత్తం మీద ఈయనకు పట్టు లేదు. కేవలం పామూరు మండలంలో కొన్ని గ్రామాల్లోనే ఈయన నాయకుడిగా పేరుంది. బొల్లా మాల్యాద్రి చౌదరి (బీఎంసీ) ట్రస్ట్ పేరిట సేవలందిస్తున్నారు. మండల స్థాయి నేత కూడా కాదు.

ఒక వర్గం మీడియాలో….

అలాంటి మాల్యాద్రి చౌదరి నేతృత్వంలో పెద్దయెత్తున టీడీపీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. కానీ వారంతా వలస కార్మికులు. కేవలం దృష్టి మరల్చడానికి ఇటువంటి చేరికల డ్రామాకు తెరలేపిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా కనిగిరి నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ఉన్న ఉగ్రనరసింహారెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండరు. ఆయనకు గుంటూరులో ప్రయివేటు వైద్య శాల ఉంది. ఎక్కువ సమయం గుంటూరులోనే ఉంటారు. కాలక్షేపం కోసం కనిగిరికి వస్తారన్న పేరుంది.

అసలు ఉగ్రమీదనే…..

ఇటువంటి సమయంలో పెద్దయెత్తున చేరికలు జరిగాయని ఒక వర్గం మీడియా ప్రచారం చేయడంపై కనిగిరి ప్రాంత ప్రజలు నవ్వుకుంటున్నారు. కనిగిరిలో ఉగ్రనరసింహారెడ్డి ఒకేసారి గెలిచారు. అదీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2009లో గెలిచారు. కనిగిరి నియోజకవర్గంలో 1984 ఎన్నికల తర్వాత 2014లోనే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి గెలిచిన కదిరి బాబూరావు కూడా వైసీపీలో చేరారు. కానీ పెద్దయెత్తున బడా నేతలు చేరినట్లు బిల్డప్ ఇవ్వడంపై సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News