వదల బాబూ…వదల…!!

చంద్రబాబు సొంత జిల్లాలో మరింత టీడీపీని దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ గత [more]

Update: 2019-11-30 00:30 GMT

చంద్రబాబు సొంత జిల్లాలో మరింత టీడీపీని దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ గత ఎన్నికల్లో వైసీపీ కోలుకోలేని దెబ్బతీసింది. ఒక్క చంద్రబాబుపోటీ చేసిన కుప్పం నియోజకవర్గం మినహా ఏ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు. చంద్రబాబు సయితం అరకొర మెజారిటీతోనే గెలిచారని చెప్పాలి. అయితే ఇంతటితో ఊరుకోకుండా చిత్తూరు జిల్లాలో పార్టీకి ఆర్థికంగా, సామాజికంగా అండదండలు అందిస్తున్న నేతలను తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ భావిస్తుంది.

బాబు సొంత జిల్లాలో….

చిత్తూరు జిల్లాలో ఎన్నికల ఫలితాల తర్వాత అంతస్దబ్దుగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేల దూకుడుతో టీడీపీ నేతలు బయటకు కూడా కొద్ది రోజులు రాలేదంటే ఆశ్చర్యం కాదు. అయితే చంద్రబాబు తన సొంత జిల్లాలో పార్టీని కాపాడుకోవాలని అందరినీ నిత్యం పలకరిస్తూ వారిలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు అన్ని నియోజకవర్గాలపై సమీక్షలు కూడా చేశారు.

డీకే కుటుంబాన్ని……

కానీ వైసీపీ మాత్రం ఆర్థికంగా, సామాజికపరంగా పట్టున్న నేతలను తమ పార్టీలోకి రప్పించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే సత్యప్రభను పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సత్యప్రభ పార్టీలోకి వస్తే టీడీపీకి గట్టి దెబ్బ పడినట్లే. సత్యప్రభ కుటుంబం ఆర్థికంగా పార్టీని కూడా ఆదుకుంటోంది. అలాగే జిల్లాలో బలమైన సామాజికవర్గం చెందిన నేత కావడంతో డీకే సత్యప్రభను వైసీపీలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు వైసీపీ తీవ్రతరం చేసింది.

సత్యప్రభతో మంతనాలు…..

డీకే సత్యప్రభ ఆదికేశవులునాయుడు సతీమణి. ఆదికేశవులునాయుడు మరణం తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీకే సత్యప్రభకు చిత్తూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా చంద్రబాబు ఆమెను రాజంపేట ఎంపీగా పోటీ చేయించారు. దీనిపై కొంత అసహనంతో ఆ కుటుంబం ఉంది. ఈ టైంలోనే సత్యప్రభను పార్టీలోకి తీసుకురావాలని వైసీీపీ చిత్తూరు జిల్లా నేతలు ప్రయత్నిస్తున్నారు. ఆమె కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబు సొంత జిల్లాలో మరో బిగ్ వికెట్ పడుతుందన్న ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News