ఈ రెండింటిలో ఆశలు వదులకోవాల్సిందేనా?

బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ సరైన నేత లేక ఇబ్బంది పడుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాలు [more]

Update: 2020-09-27 08:00 GMT

బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ సరైన నేత లేక ఇబ్బంది పడుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాలు అవి. కానీ అక్కడ గత పదిహేను నెలలుగా పార్టీని పట్టించుకునే వారు లేకపోవడంతో క్యాడర్ అధికార పార్టీ వైపు వెళుతుంది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇది. నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలు లేక పార్టీ క్యాడర్ పూర్తిగా ఇక్కడ నీరసపడుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో మేకపాటి కుటుంబమే ఆధిపత్యం వహిస్తుంది.

బలమైన కుటుంబం….

ఆత్మకూరు నియోజకవర్గంలో బలమైన మేకపాటి కుటుంబం ఉంది. ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఉన్నారు. ఈ కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికపరంగా బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంకుకకు ఏమాత్రం మొన్నటి వరకూ చిల్లి పడలేదు. ఇక్కడ ఇన్ ఛార్జులను మారుస్తుండటం ఒక కారణం. ఆత్మకూరులో మురళి కన్నబాబును టీడీపీ ఇన్ ఛార్జిగా నియమించింది.

పరామర్శించే దిక్కులేక…..

2014లో మురళి కన్నబాబుకు టిక్కెట్ ఇచ్చినా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మురళికన్నబాబు ఇన్ ఛార్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత చంద్రబాబు 2019 ఎన్నికల్లో బొల్లినేని కృష్ణయ్యకు టిక్కెట్ ఇచ్చారు. ఇప్పడు ఇద్దరూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. బొల్లినేని కృష్ణయ్య తన పార్టీ కార్యక్రమాలకు పరిమితమయ్యారు. మురళీ కన్నబాబు అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి పోతున్నారు. వర్గ కక్షల నేపథ్యంలో టీడీపీ కార్యకర్త మరణించినా ఇక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. మాజీ జడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డికి ఇన్ ఛార్జి పదవి ఇవ్వాలని భావిస్తున్నారు.

ఇక్కడా అంతే….

ఇక ఉదయగిరి నియోజకవర్గం గురించి చెప్పనవసరం లేదు. ఇక్కడ బొల్లినేని రామారావు 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. బొల్లినేని రామారావు పార్టీని పూర్తిగా పట్టించుకోవడం లేదు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో వ్యాపారాలను చూసుకుంటున్నారు. వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో ఓట్ల తొలగింపుపై గొడవలు జరిగినా వీరు పట్టించుకోవడం లేదు. మాజీ ఎమ్మెల్యే మాదాల జానకిరాం బంధువు మదన్ సయితం పార్టీ ఇన్ ఛార్జి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలు లేకపోవడంతో క్యాడర్ చాలావరకూ అధికార పార్టీలోకి వెళ్లిపోయింది.

Tags:    

Similar News