Chandrababu : బెదిరింపులు మామూలుగా లేవుగా?

ఏ రాజీకయ నాయకుడు అయినా తనకు సీటు రాదని భావిస్తే ఆ పార్టీలో ఉండరు. తనకు పోటీగా మరొకరిని నియోజకవర్గంలో తెచ్చి పెడితే అది సహించరు. పార్టీ [more]

Update: 2021-10-27 05:00 GMT

ఏ రాజీకయ నాయకుడు అయినా తనకు సీటు రాదని భావిస్తే ఆ పార్టీలో ఉండరు. తనకు పోటీగా మరొకరిని నియోజకవర్గంలో తెచ్చి పెడితే అది సహించరు. పార్టీ నుంచి బయటకు వెళ్లడమో, అదే పార్టీలో ఉండి అసంతృప్తి వెళ్లగక్కడమో చేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అదే జరుగుతుంది. పార్టీని బలోపేతం చేయాలని హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి.

కీలక నిర్ణయాలు….

గత రెండున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీలో నిస్తేజం అలుముకుంది. ఇప్పుడిప్పుడే కొంత నేతల్లో కదలిక మొదలయింది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి కిందిస్థాయి క్యాడర్ వరకూ రెండేళ్ల పాటు సీరియస్ గా లేరు. అయితే ఎన్నికల సమయం ఇంకా మూడేళ్లు ఉండటం, పార్టీని బలోపేతం చేయాల్సి రావడతో నాయకత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే కొందరిని పార్టీ ఇన్ ఛార్జులుగా నియమించారు. మరికొందరిని తొలగిస్తున్నారు.

వారిని నియమించారని….

అందులో భాగంగానే గంగాధర నెల్లూరు లో సీనియర్ నేత గుమ్మడి కుతూహలమ్మ కుటుంబాన్ని కాదని చంద్రబాబు నియోజకవర్గం సమన్వయ కర్తగా మాజీ జడ్పీటీసీ చిట్టిబాబు నాయుడిని నియమించారు. అయితే చిట్టిబాబు నియామకాన్ని కుతూహలమ్మ, ఆమె కుమారుడు హరికృష్ణ వ్యతిరేకించారు తాము ఇన్ ఛార్జిగా ఉండగా సమన్నవయ కర్త ఎందుకని ప్రశ్నించారు. అయితే అధినాయకత్వం సమాధానం చెప్పకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

భవిష్యత్ లో మరిన్ని బెదిరింపులు….

దీంతో చిత్తూరు జిల్లాలో ఒక సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేసినట్లయింది. ఇటీవల కాలంలో చంద్రబాబు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అది బెడిసి కొడుతుంది. పార్టీ నేతలు కేర్ చేయడం లేదు. రాజీనామాల బెదిరింపులకు దిగుతున్నారు. అయితే వీటిని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకే సొంత జిల్లాలో సీినియర్ నేత రాజీనామా చేసినా పెద్దగా పట్టించుకోలేదు. రానున్న కాలంలో టీడీపీ నేతల బెదిరింపులు మరింత ఎక్కువయ్యే అవకాశముంది.

Tags:    

Similar News