నిజమే.. ఇప్పుడు అదే అనుకుంటున్నారుగా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం ఎవరు? సాంకేతికంగా చూసినా, క్యాడర్ పరంగా చూసినా తెలుగుదేశం పార్టీయే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం. ఇందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. [more]

Update: 2020-09-25 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం ఎవరు? సాంకేతికంగా చూసినా, క్యాడర్ పరంగా చూసినా తెలుగుదేశం పార్టీయే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం. ఇందులో ఎవరికి ఎటువంటి సందేహం లేదు. కానీ మీడియా పరంగా చూస్తే ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అనే చెప్పక తప్పదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా నిరాశ, నిస్పృహలో కొట్టుమిట్టాడుతుంది. కేసులకు భయపడి టీడీపీ నేతలు బయటకు రావడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ మాత్రం ఏపీలో గట్టిగానే పోరాడుతున్న సంఘటనలు చర్చనీయాంశమయ్యాయి.

చంద్రబాబు హైదరాబాద్ లోనే….

వైసీపీ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు కావస్తుంది. తొలి ఆరు నెలల పాటు చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకన్నా ఓటమి పై సమీక్షలకే ప్రాధాన్యత ఇచ్చారు. తొలినాళ్లలో ఇసుక కొరత, కార్యకర్తలపై దాడులు వంటి వాటితో కొన్ని కార్యక్రమాలు చేసినా అవి పెద్దగా ఫలప్రదం కాలేదు. అయితే ఈ ఏడాది మార్చి నెల నుంచి చంద్రబాబు పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కరోనా విజృంభిస్తుండటంతో అడపా దడపా అమరావతికి వచ్చి పోవడం తప్ప ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

ఇళ్లల్లోనే నిరసనలు…..

ఇక ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలన్నా టీడీపీ నేతలు ఇంటి నుంచే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చేస్తున్నారు. అయితే దీనికి ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. రాజధాని అమరావతి విషయంలో గాని, విద్యుత్తు మోటార్లకు మీటర్లు బిగించడంలో గాని, అక్రమ కేసుల బనాయింపుపై కాని, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర అరెస్ట్ ల సమయంలోనూ ఇళ్లల్లోనే నిరసనలు తెలియజేశారు. కరోనా కారణంగా టీడీపీ నేతలు కూడా పెద్దగా ప్రజల్లోకి వచ్చేందుకు ఇష్టపడటం లేదు.

బీజేపీ మాత్రం……

ఇదే సమయంలో బీజేపీ మాత్రం దూకూడు పెంచిందనే చెప్పాలి. అంతర్వేది రధం దగ్దం ఘటన, దుర్గగుడి రధంలో సింహాల మాయంపై టీడీపీ కన్నా బీజేపీయే ముందు ఆందోళనలకు దిగింది. బీజేపీ బృందం తొలుత దుర్గగుడి రధాన్ని సందర్శించింది. మరో వైపు చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ లతో బీజేపీకి మంచి మైలేజీ వచ్చిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీని వెనక్కు పంపేంత కాకపోయినా బీజేపీ ఏపీలో తన ఉనికిని మాత్రం ఇటీవల తన కార్యక్రమాలతో ప్రకటించుకుంటుంది.

Tags:    

Similar News