టీడీపీలో ఆ ఇద్దరు ఫుల్ సైలెంట్‌.. రీజ‌నేంటి…?

టీడీపీ కంచుకోట‌గా ఉన్న అనంత‌పురం జిల్లాలో కేవ‌లం ఒకే ఒక్క ఎన్నిక‌ల ఫ‌లితం పార్టీని, పార్టీ హ‌వాను, నాయ‌కుల‌ను కూడా త‌ల‌కిందులు చేసేసింది. 2014లో జోరుమీదున్న పార్టీ [more]

Update: 2020-04-09 15:30 GMT

టీడీపీ కంచుకోట‌గా ఉన్న అనంత‌పురం జిల్లాలో కేవ‌లం ఒకే ఒక్క ఎన్నిక‌ల ఫ‌లితం పార్టీని, పార్టీ హ‌వాను, నాయ‌కుల‌ను కూడా త‌ల‌కిందులు చేసేసింది. 2014లో జోరుమీదున్న పార్టీ 2019 వ‌చ్చే స‌రికి జిల్లా వ్యాప్తంగా చ‌తికిల ప‌డింది. కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే విజ‌యం సాధించింది. 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం క‌దిరి, ఉర‌వ‌కొండ‌లో మాత్రమే ఓడిన టీడీపీ 2019కు వ‌చ్చేస‌రికి ఉర‌వ‌కొండ‌, హిందూపురంలో మాత్రమే గెలిచి అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓడింది. స‌రే..ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే కాబ‌ట్టి దీనిని లైట్‌గా తీసుకోవ‌చ్చు. కానీ, ఎందుకో.. ఇక్కడి నాయ‌కులు అనూహ్యంగా టీడీపీని వీడ‌డం ప్రారంభించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన ఐదారు నెల‌ల‌కే ధ‌ర్మవ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ర‌దాపురం సూరి వంటి వారు పార్టీకి న‌మ్మిన బంట్లు. అయితే, ఆయ‌న బీజేపీలోకి చేరిపోయారు. దీంతో ధ‌ర్మవ‌రంలో పార్టీ పట్టు కోల్పోయే ప‌రిస్థితి ఏర్పడింది.

వాయిస్ గట్టిగానే విన్పిస్తున్నా…..

తాజాగా మ‌రో ఇద్దరు నాయ‌కులు కూడా ఇక్కడ పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించ‌లేక పోతున్నార‌న్న చ‌ర్చలు పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. కొన్నాళ్లు ఫ‌ర్వాలేద‌నుకున్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు .. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. 2014లో గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా చేసిన కాల్వ.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఆ త ర్వాత కూడా పార్టీ వాయిస్‌ను గ‌ట్టిగానే వినిపించారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేర‌కు జ‌గ‌న్ ప్రభుత్వంపై అనేక రూపాల్లో నిర‌స‌న వ్యక్తం చేశారు. జేసీ బ్రద‌ర్స్ ఉన్నా.. కూడా వారిలో గ‌తంలో ఉన్నంత దూకుడు లేదు. ఉర‌వ‌కొండ నుంచి గెలిచిన పయ్యావుల కేశ‌వ్ ఉన్నా ఆయ‌న జిల్లాలో ప్రభావం చూపించే ప‌రిస్థితి లేదు. దీంతో కాల్వ గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నార‌నే భావ‌న ఏర్పడింది. అయితే, ఇంతలోనే ఆయ‌న మౌనం పాటించారు. అంతేకాదు, త్వర‌లోనే ఆయ‌న వైసీపీలోకి చేరిపోతున్నార‌నే ప్రచారం కూడా సాగుతోంది.

పరిటాల ఫ్యామిలీ సయితం….

బీసీల్లో ప‌ట్టున్న బ‌ల‌మైన నేత‌గా గుర్తింపు ఉన్న కాల్వను వైసీపీలో చేర్చుకునేందుకు వైసీపీ అధిష్టానం కూడా సుముఖంగానే ఉందంటున్నారు. మ‌రోప‌క్క, టీడీపీకి అత్యంత స‌న్నిహిత‌మైన కుటుంబం ప‌రిటాల ఫ్యామిలీ. దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా ఈ కుటుంబం టీడీపీతోనే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రిటాల ర‌వి వార‌సుడిగా శ్రీరాం రంగంలోకి దిగారు. రాప్తాడులో శ్రీరాం ఘోరంగా ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి కూడా ప‌రిటాల కుటుంబం మౌనంగా ఉంటోంది. ఇటీవ‌ల నారా లోకేష్ హైద‌రాబాద్ లో పార్టీ యువ నేత‌ల‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన నేప‌థ్యంలో అక్కడ‌కు వెళ్లి వ‌చ్చినప్పటికీ శ్రీరామ్ మాత్రం ముభావంగానే ఉంటున్నాడు. దీంతో అస‌లు ఏం జ‌రిగింది? ఏదైనా పార్టీలోకి మారాల‌ని ప్రయ‌త్నిస్తున్నా రా? అనే కోణంలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

గ్రూపు రాజకీయాలతో….

ఇక పార్టీలో ఉన్న వారిలో క‌దిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంక‌ట ప్రసాద్‌, అనంత‌పురం మాజీ ఎమ్మెల్యే ప్రభాక‌ర్ చౌద‌రి లాంటి వాళ్లు యాక్టివ్‌గా ఉంటున్నారు. క‌ళ్యాణ‌దుర్గం, శింగ‌న‌మ‌ల లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు రాజ‌కీయాలు రాజ్యమేలుతున్నాయి. మొత్తానికి పోయిన వాళ్లు పోగా..ఉన్నవారిలోనూ ఇలా ఎవ‌రికి వారుగానే ఉంటుండ‌డంతో పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌నే చెప్పాలి.

Tags:    

Similar News