గెలిచినంత ఆనందమే మరి

ఆరు నెలలు అయింది మంచి వార్త విని. పార్టీ చూస్తే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ఓటమిపాలు అయింది. భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయింది. ఓ వైపు [more]

Update: 2019-11-01 13:30 GMT

ఆరు నెలలు అయింది మంచి వార్త విని. పార్టీ చూస్తే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోరమైన ఓటమిపాలు అయింది. భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయింది. ఓ వైపు చూస్తే వలసలు, మరో వైపు చూస్తే పెరుగుతున్న శత్రువులు, పోరాడేందుకు పాత శక్తి లేదు, క్యాడర్ లో ఆ జోష్ కూడా కానరావడంలేదు. ఎన్ని కబుర్లు చెప్పినా కూడా పార్టీలో వూపు, ఉత్సాహం అసలు రావడంలేదు. ఇలాంటి విచిత్రమైన విషాద సన్నివేశం టీడీపీ శిబిరంలో నెలకొని ఉన్న వేళ ఒక వార్త వినిపించింది. అది చెవులకు ఎంతో ఇంపుగా ఉంది. నిజంగా గతంలో ఎపుడూ లేని జోష్ ఇపుడు టీడీపీ నేతల్లో కనిపిస్తోది. ఇంతకీ ఆ శుభ వర్తమానం ఏంటంటే ముఖ్యమంత్రి హోదా లో కూడా నిందితుడిగా జగన్ కోర్టు మెట్లు ఎక్కడం.

ఇమేజ్ డ్యామేజ్….

ఒక్క దెబ్బకు జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నదే టీడీపీ సంబరానికి అసలు కారణం. తాము ప్రతీ రోజూ జగన్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా జనం పట్టించుకోరని, అదే కళ్ళ ముందే జగన్ కోర్టు మెట్లు ప్రతీ శుక్రవారం ఎక్కుతూ ఉంటే మాత్రం ఓటేసిన జనానికే చికాకుగా ఉంటుందని టీడీపీ అంచనా కడుతోంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వారం వారం కోర్టు గడప తొక్కుతుంటే అంతకు మించిన సాక్ష్యం వేరే ఏముంటుంది, ఆ మీదట తాము చేసే విమర్శలకు జన హృదయాలు భగ్గుమని మండితే చాలు అందులో చలి కాచుకోవచ్చునన్నదే టీడీపీ వ్యూహం. జగన్ కి సీబీఐ ట్రయల్ కోర్టు షాక్ ఇవ్వడాన్ని టీడీపీ ఓ పెద్ద పండుగలాగ చేసుకుంటోంది. జగన్ జైలుకే పోతాడని సీనియర్ మంత్రి యనమల రామక్రిష్ణుడు లాంటి వారు జోస్యాలు చెబుతూంటే వైసీపీలో కొత్త సీఎం విజయసాయిరెడ్డి అంటున్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న. మొత్తానికి చిరిగి చాట చేసేందుకు టీడీపీకి ఇపుడు జగన్ అడ్డంగా దొరొకేశాడనే అనుకోవాలి.

ఇదే కదా స్ట్రాటజీ…..:

పరుగుపందెంలో ముందు పరిగెడితేనే గెలుపు కాదు, పోటీదారు కళ్ళకు అడ్డం పెట్టి పడగొట్టినా గెలుపే. రాజకీయాల్లో ఇపుడు ఇదే అసలైన నీతి. ఇదే విజయ సూత్రం కూడా. అందువల్లనే టీడీపీ ఎటూ తన ఇమేజ్ పెంచుకోలేకపోతోంది. తన సైజ్ ఎక్కడా పెరిగే సూచనలు కూడా కనుచూపు మేరలో లేవు. దాంతో బలమైన శత్రువు బలహీనుడు కావాలనే తెలివైన రాజకీయ నేత కోరుకుంటారు. దీవించినట్లుగా అదే జరిగితే పట్టరాని పసుపు పార్టీకి సంతోషమే కదా. ఇక జగన్ విషయానికే వస్తే అప్రతిహతమైన విజయం దక్కడంతో రాజకీయాల్లో మధ్యాహ్న మార్తాండుడులా దూసుకుపోతున్నారు. ఆయన్ని ఇప్పట్లో కొట్టడం కష్టమనుకున్న వారికి సీబీఐ తీర్పు నెత్తిన పాలే పోసిందంటున్నారు.

రాజీనామా చేయాలట….

టీడీపీ నేతలు అయితే మరికాస్తా ముందుకెళ్ళి జగన్ ని రాజీనామా చేయమంటున్నారు. నైతిక విలువలు వగైరా కబుర్లు చెబుతూ జగన్ కి ఒక్క నిముషం కూడా అధికారంలో ఉండే వీలులేదని గర్జిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో కోర్టు మెట్లు ఎక్కడం జగన్ కి కూడా తలవంపులే. ఆయన ఇప్పటిదాకా పాలనలో శాసిస్తూ వచ్చారు. పార్టీలోనూ తిరుగులేని నేతగా ఉన్నారు. మరి ఈ హోదాలో ముద్దాయిగా మారితే అందరి వద్ద పలుచన అవుతారు. ఇదే ఇపుడు వైసీపీని పట్టిపీడిస్తూంటే టీడీపీ మాత్రం బిగ్ వికెట్ పడిపోవడం ఖాయమంటోంది.

Tags:    

Similar News