లెక్కింపు ఆలస్యమయినా లెక్క సరిపోయిందట

కొద్దోగొప్పో పట్టున్నదనుకున్న పశ్చిమ గోదావరి జిల్లాలో సయితం తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలులే వీచాయి. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ విజయం సాధించడం విశేషం. ఈ [more]

Update: 2021-07-26 03:30 GMT

కొద్దోగొప్పో పట్టున్నదనుకున్న పశ్చిమ గోదావరి జిల్లాలో సయితం తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలులే వీచాయి. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ విజయం సాధించడం విశేషం. ఈ జిల్లాలో తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి గ్రిప్ ఉంది. పైగా కృష్ణా జిల్లాను ఆనుకునే ఉండటంతో ఆ ప్రభావం కూడా కొంత మేర ఉంటుంది. అయితే ఇవేమీ ఎన్నికల్లో చూపించలేదు. ఏలూరు కార్పొరేషన్ ను సునాయాసంగా వైసీపీ గెలుచుకుంది. దీంతో రాష్ట్రంలోని కార్పొరేషన్లన్నీ వైసీపీ పరమయ్యాయి.

అత్యధిక స్థానాల్లో….

ఏలూరు కార్పొరేషన్ కు 47 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా అందులో వైసీపీ 44 డివిజన్లలో విజయం సాధించింది. టీడీపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమయింది. అన్ని స్థానిక స్థంస్థల ఎన్నికలతో పాటు ఏలూరు కార్పొరేషన్ కు మార్చి 10వ తేదీన ఎన్నికలు జరిగాయి. లెక్కింపు ఆలస్యమయినా చివరకు వైసీపీదే విజయం అయింది. ఇక్కడ టీడీపీ గెలిచేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

జనసేనకు లోపాయికారీగా…

తమకు బలంలేని స్థానాల్లో జనసేనకు తెలుగుదేశం లోపాయికారీగా మద్దతు ఇచ్చింది. ఆ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ మేరకు బహిరంగంగానే ప్రకటన చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఏలూరులో బలమైన నాయకత్వం లేకపోవడం, వైసీపీ పుంజుకోవడంతోనే ఇక్కడ గెలుపు సాధ్యం కాలేదంటున్నారు. ఆర్థికంగా కూడా తమను ఆదుకోలేదని టీడీపీ అభ్యర్థులు చెబుతున్నారు.

అడ్రస్ లేకుండా….

ఇక తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ అడ్రస్ లు కూడా గల్లంతయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొద్దోగొప్పో జనసేన, బీజేపీలు కొంత ప్రభావం చూపే అవకాశముందని అంచనా వేశారు. కానీ ఈ రెండు పార్టీలకు ఒక్క స్థానం దక్కకపోవడం విశేషం. తొలిసారి కలసి పొత్తులతో బరిలోకి దిగినప్పటికీ ఏలూరు ఓటర్లు వారిని ఆదరించలేదు. మొత్తం మీద ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విపక్షాలకు మరోసారి భంగపాటు తప్పలేదు.

Tags:    

Similar News