బాబుకు గట్టి ఆశలే ఉన్నాయే

కొద్ది నెలలు ఆగండి వైసీపీ రంగులు రాజకీయం మొత్తం మార్చేస్తాను అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన చిత్తూరు జిల్లా టీడీపీ సమీక్షా సమావేశంలో ఆసక్తికరమైన కామెంట్స్ [more]

Update: 2019-11-08 09:30 GMT

కొద్ది నెలలు ఆగండి వైసీపీ రంగులు రాజకీయం మొత్తం మార్చేస్తాను అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన చిత్తూరు జిల్లా టీడీపీ సమీక్షా సమావేశంలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. టీడీపీని వైసీపీ ఏమీ చేయలేదని, జగన్ చేతకాని సీఎం అంటూ తిట్లు లంకించుకున్న చంద్రబాబు టీడీపీ ఓడినా కూడా జనంలో బలంగానే ఉందని క్యాడర్ కి భరోసా ఇచ్చారు. ఇపుడు ఏ ఎన్నిక పెట్టినా మనదే అధికారం అంటూ ఉత్సాహపరచారు. కేవలం అయిదు నెలలోనే ప్రజాభిమానం పూర్తిగా కోల్పోయిన పార్టీ వైసీపీ అంటున్నారు. చిత్తు చిత్తుగా ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారని కూడా చంద్రబాబు చెబుతున్నారు. జనం జగన్ కి ఓటేసి తప్పు చేశామన్న భావనతో ఉన్నారని, దానికి బదులుగా టీడీపీకే ఈసారి ఓటు వేస్తారని కూడా అంటున్నారు.

రంగులు మార్చేస్తాం….

ఏపీలోని పంచాయతీ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేశారని చంద్రబాబు ఆవేశం ప్రదర్శించారు. ప్రభుత్వ ఆస్తులకు పార్టీ రంగులేంటని కూడా నిలదీస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. మొత్తానికి మొత్తం సీట్లు మననే గెలవబోతున్నాం, అందువల్ల గెలిచిన వెంటనే గ్రామ పంచాయతీలలో రంగులు మార్చేద్దాం, వైసీపీ అసలు రంగు కూడా బయటపెడదాం అంటున్నారు చంద్రబాబు. ఒక్కొక్క కార్యకర్తను వైసీపీ ఇబ్బంది పెడితే దానికి బదులు తీర్చుకుంటామని కూడా చంద్రబాబు చెబుతున్నారు. మొత్తానికి జిల్లాల సమీక్షలు వరసగా నిర్వహిస్తున్న బాబుకు సొంత జిల్లా చిత్తూరుకు వచ్చేసరికి ఎక్కడ లేని ధైర్యం వచ్చిన ట్లుందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో మొత్తం సీట్లలో చంద్రబాబు గెలిచింది ఒక్క కుప్పంలో మాత్రమే. అది కూడా మెజారిటీ సగానికి సగం పడిపోయింది కూడా మరి ఆరు నెలలలోనే వైసీపీ అవుట్ అంటున్నారు చంద్రబాబు.

సీన్ మారిందా….నిజమేనా?

నిజంగా జగన్ సర్కార్ మీద జనంలో వ్యతిరేకత వెల్లువెత్తుతోందా అన్నది ఇక్కడ చర్చగా ఉంది. జగన్ సంక్షేమం జపం చేస్తున్నారు. ముందు పధకాలు వరసగా ప్రకటించేస్తున్నారు. వాటి నిధులు సంగతి తరువాత చూసుకుందామనుకుంటున్నారు. అభివ్రుధ్ధి అయితే మందికి చేరుతుంది. అదే పధకం అయితే ఇంటికే వస్తుంది. జగన్ తాను రాజకీయంగా బలపడడానికి ఈ విధానం ఎంచుకున్నారని అంటున్నా నిధుల లేమి వల్ల ఏమైనా ఆటంకం ఏర్పడితే రెండిందాలా చేటు వస్తుందని చంద్రబాబు వంటి వారు ఊహిస్తున్నారు.

ఊహా….వాస్తవమేనా?

ఇక ఇసుక సమస్య మీద జనంలో వ్యతిరేకత ఇప్పటికే వచ్చేసిందని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారులా ఉంది. అదే విధంగా వ్యాపార లావాదేవీలు ఆర్ధిక మాంద్యం వల్ల కుంటుపడినా కూడా దాన్ని తెలివిగా జగన్ ఖాతాలో వేసేసిన చంద్రబాబు ఎంతగా వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోతే అంతలా జగన్ మీద వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారు. పవన్ లాంగ్ మార్చ్ విజయవంతం కావడంతో జనాగ్రహం అలా బయటపడిందని కూడా ఊహిస్తున్నారు. మరి నిజంగా వ్యతిరేకత ఉంటుందా అంటే ఏమో చెప్పలేమని రాజకీయ పండితులు కూడా అంటున్నారు. 1994 డిసెంబర్లో అన్న నందమూరి 225 సీట్లతో ఉమ్మడి ఏపీలో బంపర్ మెజారిటీ సాధించారు. ఆ తరువాత 1995 ఫిబ్రవరిలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో సగానికి సగన్ సీట్లలో ఓడిపోయారు. మరి చూడాలి ఏపీలో ఎలా ఉంటుందో.

Tags:    

Similar News