మహానాడుకు వారు డుమ్మా… బాబు పాత పాటే?

అధికార ప్రభావం కోల్పోయి మహానాడు నిర్వహిస్తున్న టిడిపి పరనింద … ఆత్మస్తుతి అనే రీతిలోనే తమ పార్టీ పండగను చేపట్టిందనే విమర్శలు విశ్లేషకుల నుంచి వినవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2020-05-28 05:00 GMT

అధికార ప్రభావం కోల్పోయి మహానాడు నిర్వహిస్తున్న టిడిపి పరనింద … ఆత్మస్తుతి అనే రీతిలోనే తమ పార్టీ పండగను చేపట్టిందనే విమర్శలు విశ్లేషకుల నుంచి వినవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక గమనంపై గతంలో తాము తీసుకున్న చర్యలే ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయని మహానాడు లో అధినేత పేర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. అంతే కాదు దేవుడి భూముల అమ్మకంపై గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనలు పక్కన పెట్టి జగన్ సర్కార్ పై విమర్శలకు దిగడం గమనార్హం. ప్రాజెక్ట్ ల పై కూడా టిడిపి ఫైర్ కావడం పైనా అటు ప్రభుత్వంలో ఉన్నవారు, వైసిపి పార్టీ వారు భగ్గుమంటున్నారు. స్థానిక ఎన్నికల వాయిదా, నిమ్మగడ్డ రమేష్ ను పదవినుంచి తొలగించడంపైనా ప్రధాన విపక్షం తెరపైకి మరోసారి తెచ్చింది.

దిశా… దశ ఏవి …?

డిజిటల్ మీడియా ద్వారా మహానాడు నిర్వహించడం మినహా ఈసారి పసుపు పండగలో ప్రత్యేకత ఏమీ లేదు. ఒక ఏడాది డుమ్మా కొట్టి కరోనా సమయంలో వైరటీగా వర్చువల్ మహానాడు అంటూ జూమ్ యాప్ ద్వారా నేతలు, కార్యకర్తలతో కార్యక్రమం చేపట్టి పొలిటికల్ పార్టీలకు కొత్త మార్గం సూచించింది టిడిపి. అయితే కార్యక్రమంలో పస లేకపోవడంతో సొంత పార్టీలోనే పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.

పాత కధనే వినిపించి…

కార్యకర్తలే బలం అంటూ పాత కథనే కొత్త మహానాడులో చంద్రబాబు వినిపించారని అంటున్నారు కొందరు. ఇక పార్టీ నుంచి మరికొందరు ఎమ్యెల్యేలు గోడ దూకేస్తారన్న చర్చ పెద్ద హాట్ టాపిక్ నే సృష్టిస్తుంది. దీనికి తోడు గంటా శ్రీనివాస్ సహా మరో ఇద్దరు మహానాడుకి డుమ్మా కొట్టడంతో ఇవి పుకార్లు కావని తేలిపోతుంది. ఇక వైసిపి ఇచ్చే గిఫ్ట్ మహానాడు లోనా లేక ఇది పూర్తి అయ్యాకా అన్నది ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News