కరడుగట్టిన టీడీపీ నేతలే..?

తమ్ముళ్లు కట్టుతప్పుతున్నారు. అవును! ఈ మాట‌ను టీడీపీ అంటే ఇష్టంలేని వైసీపీ నేత‌లు అన‌డం లేదు..! క‌ర‌డు గ‌ట్టిన టీడీపీ అభిమానులే అంటున్నారు. రాష్ట్రంలో గ‌డిచిన నెల [more]

Update: 2019-09-01 14:30 GMT

తమ్ముళ్లు కట్టుతప్పుతున్నారు. అవును! ఈ మాట‌ను టీడీపీ అంటే ఇష్టంలేని వైసీపీ నేత‌లు అన‌డం లేదు..! క‌ర‌డు గ‌ట్టిన టీడీపీ అభిమానులే అంటున్నారు. రాష్ట్రంలో గ‌డిచిన నెల రోజులుగా టీడీపీ ప‌రిస్థితిని నిశితంగా గ‌మ‌నిస్తున్న వారు కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా గ‌తానికి ఇప్పటికి టీడీపీలో చాలా మార్పు వ‌చ్చింద‌ని చెబుతున్నారు. గ‌తంలో చంద్రబాబు ఒక్క పిలుపు ఇస్తే.. చాలు మూకుమ్మడిగా నాయ‌కులు క‌దిలి వ‌చ్చి.. పార్టీ కోసం .. అధినేత కోసం క్యూ క‌ట్టేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఏ కార్యక్రమం చేప‌ట్టినా.. అది దిగ్విజ‌య‌మైంది. ధ‌ర్మ పోరాటాల‌కు పెద్ద ఎత్తున సొంత ఖ‌ర్చుతో వ‌చ్చిన వారు కూడా ఉన్నారు.

ఎక్కడా కన్పించక…..

ఇత‌ర పార్టీ ల నుంచి కూడా వ‌చ్చి .. చంద్రబాబుకు మ‌ద్దతు తెలిపిన బుట్టా రేణుక వంటివారిని మ‌రిచిపో లేం. ఇలా సాగిన ఆయ‌న హ‌వా.. ఒక్క ఓట‌మితో ఒకే ఒక్క ఓట‌మితో చెల్లా చెదురైంది. ఇప్పుడు చంద్రబా బు మాట‌లు వినేవారు కాదు క‌దా.. ఆయ‌న‌ను ప‌ట్టించుకునే నాథుడు కూడా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న ను ఆయ‌న త‌న‌యుడిని స‌మ‌ర్ధించిన వారు, రాజ‌కీయ వార‌స‌త్వానికి మ‌ద్దతుగా నిలిచిన నాయ‌కులు కూడా ఇప్పుడు క‌లుగుల్లో దాక్కుని ఉన్నారు. బాబే నా ప్రాణం.. ఆయ‌న కోసం ఏమైనా చేస్తాము.. అన్న బోడే ప్రసాద్ వంటివారు.. పార్టీక‌న్నా నాకు ఏదీ ఎక్కువ కాదు.. అన్న చింత‌మ‌నేని ప్రభాక‌ర్ వంటి వారు ఇప్పుడు ఎక్కడా క‌నిపించ‌డం లేదు.

చొక్కాలు చింపుకున్న వారు…..

పైగా లోకేష్ సీఎం అయితే త‌ప్పేంటి? అని ప్రశ్నించిన జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. నిన్నటికి నిన్న ఇసుక పై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న చేస్తే.. బాబు కోసం చొక్కాలు చింపుకుంటామ‌ని ప్రక‌టించిన నాటి చంద్రబాబు సైన్యం.. ఇప్పుడు క‌నిపించ‌కుండా పోయింది. అదేస‌మయంలో కీల‌క‌మైన నాయ‌కులు కేసుల్లో చిక్కుకుని చంద్రబాబునే డిఫెన్స్‌లో ప‌డేశారు. మ‌రోప‌క్క, టికెట్ల కోసం ఆయ‌న ఇంటికి ప్రద‌క్షిణ‌లు చేసిన కొన్ని వ‌ర్గాలు ఇప్పుడు ఆయ‌న ఇల్లు తీసేస్తామ‌ని జ‌గ‌న్ అంటే..ఒక్క క‌మ్మ వ‌ర్గంలోని కొంద‌రిని త‌ప్పిస్తే.. మిగిలిన‌వారు మౌనం పాటించారు.

క్రమశిక్షణ ఏమైంది….?

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప‌దే ప‌దే చంద్రబాబు భ‌జ‌న చేసిన టీడీపీ సీనియ‌ర్లు కూడా ఇప్పుడు పూర్తిగా బాబును ప‌ట్టించుకోవ‌డం మానేశారు. కొంద‌రు నేత‌లు అయితే బాబు క‌ల‌వాల‌ని క‌బురు పెట్టినా లైట్ తీస్కొంటున్నారు. ఇలా .. పార్టీలో ఎక్కడా క్రమ‌శిక్షణ అనేది మ‌న‌కు మ‌చ్చుకైనా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి భ‌విష్యత్తులో అయినా మారుతుందా? చూడాలి.

Tags:    

Similar News