అచ్చెన్న షాక్ నుంచి కోలుకోవాలని చూసి తమ్ముళ్ళు దెబ్బయ్యరా ?

ఆ మధ్య టిడిపి ఎపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆఫ్ ది రికార్డ్ లో చేసిన కామెంట్స్ తిరుపతి ఎన్నికల ముందు హాట్ టాపిక్ అయ్యాయి. టిడిపి ని [more]

Update: 2021-05-08 06:30 GMT

ఆ మధ్య టిడిపి ఎపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆఫ్ ది రికార్డ్ లో చేసిన కామెంట్స్ తిరుపతి ఎన్నికల ముందు హాట్ టాపిక్ అయ్యాయి. టిడిపి ని ఆయన వ్యాఖ్యలు పెద్ద కుదుపే కుదిపేశాయి. లోకేష్ నాయకత్వం పై వ్యతిరేక గళం పార్టీ శ్రేణుల్లో మొదలయ్యేందుకు ప్రేరేపితం కూడా అయ్యాయి. తిరుపతి ఎన్నికల తరువాత పార్టీ లేదు బొక్కా లేదు అంటూ అచ్చెన్న టిఫిన్ చేస్తూ తాపీగా మనసులో మాట చెప్పేశారు. దీన్ని వైసిపి మీడియా రచ్చ రచ్చే చేసేసింది. అసలే గత ఎన్నికల తరువాత దీనంగా మారిన టిడిపి కి ఈ పరిణామం మూలిగే నక్కపై తాటిపండులా పడింది. దాంతో ఈ డ్యామేజ్ కంట్రోల్ కు అచ్చెన్నాయుడు చేత లోకేష్ కు జిందాబాద్ కొట్టించినా ఫలితం లేకుండా పోయింది. ఇక అప్పటినుంచి వైసిపి నేతలు ఎప్పుడు దొరుకుతారా వారి సంగతి తేల్చాలని పగబట్టి మరీ టిడిపి మీడియా వేచి చూస్తుంది.

టార్గెట్ బోస్ …

మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటీవల రాజమండ్రి లో పేదల అంత్యక్రియల కోసం పార్టీ కో ఆర్డినేటర్ డా ఆకుల సత్యనారాయణ సొంత ఖర్చుతో సమకూర్చిన వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకుల స్వగృహంలో కొద్ది సేపు ఎంపీ భరత్ రామ్, మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ లతో ముచ్చట్లు మొదలు పెట్టారు. ఈ ప్రైవేట్ సంభాషణల్లో డా ఆకుల కేంద్రం కరోనా లో చేతులు ఎత్తేసినట్లే కనపడుతుందని అధికారులు అదే తీరులో ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బోస్ కరోనాపై పరిస్థితి దారుణంగానే ఉందని మరో వారం తరువాత ఈ అంశాలపై మాట్లాడతా అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ టిడిపి మీడియా తో పాటు సోషల్ మీడియా జగన్ సర్కార్ కరోనా కట్టడిలో చేతులెత్తేసింది అని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారంటూ పెద్ద ఎత్తున హడావిడి మొదలు పెట్టింది. ఇందులో ఆకుల వ్యాఖ్యలే తప్ప బోస్ మాట్లాడింది ఎక్కడా లేదు. అయినా కానీ వైసిపి ఎంపీలే జగన్ వైఫల్యాన్ని అంగీకరించారంటూ విషయం లేని వీడియో ను తెగ వైరల్ చేసేసింది ఆ పార్టీ మీడియా.

అధిష్టానమా అదెక్కడా అన్న బోస్ …

అధిష్టానమా అదెక్కడా ? నాకు అధిష్టానం అంటే వైఎస్ ఆర్. ఆయనే నాకు టిక్కెట్ ఇచ్చారు. అంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై మంత్రి గా ఉంటూనే వైఎస్ మరణం తరువాత ధ్వజం ఎత్తి మరి పిల్లి బోస్ జగన్ వెంట నడిచారు. మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసి వచ్చిన పిల్లి బోస్ అంటే వైఎస్ జగన్ కు ఎంతో అభిమానం. ఆయనకు సమున్నత స్థానం కల్పిస్తూ వచ్చారు జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బోస్ ని ముందు ఎమ్యెల్సీ ఆ తరువాత మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి పార్టీ అధికారంలోకి రాగానే తగిన గుర్తింపు ఇచ్చారు జగన్. అంతే కాదు ఆయన ఎమ్యెల్సీ పదవీకాలం ముగియకుండానే రాజీనామా చేయించి రాజ్యసభకు పంపి బోస్ తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేశారు ఫ్యాన్ పార్టీ అధినేత. పార్టీలో ఎందరో ఉన్నా పిల్లి సుభాష్ చంద్రబోస్ కి జగన్ ఇచ్చే గౌరవం అంతా ఇంతా కాదు. బోస్ అన్నా అంటూ తన తండ్రి బాటలో నడిచి తన ఉన్నతి కోరుకున్న వ్యక్తిగా ఆయనకెప్పుడు సమున్నత స్థానమే అధినేత ఇస్తూ వచ్చారు . బోస్ సైతం అదే విధేయత వైఎస్ కుటుంబం పట్ల చూపిస్తూ వస్తున్నారు. లో కీలక భూమికనే అప్పగించారు జగన్.

టిడిపికి ఛాలెంజ్ విసిరిన బోస్ …

సంచలన వార్తగా తాను చేయని వ్యాఖ్యలను చేసినట్లు చిత్రీకరించిన మీడియా పై అగ్గిమీద గుగ్గిలమే అయ్యారు. తాను పార్టీ కి ద్రోహం చేసేలా వ్యాఖ్యానించినట్లు నిరూపిస్తే రాజీనామా చేసి పోతా అంటూ ఘాటుగా ఛాలెంజ్ విసిరారు. లేకపోతే తనకు క్షమాపణ చెప్పలన్నారు బోస్. పిచ్చాపాటి సంభాషణల్లో యంత్రాంగం చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుందనడం నిజమేనని, ప్రజల కోసం ఆయన ఆవేదన నిజమేనని అని తాను చెబితే దానిని వక్రీకరిస్తారా ఇదెక్కడి రాజకీయాలు, ఇదెక్కడి మీడియా అంటూ నిప్పులు చెరిగారు బోస్. సాధారణంగా పిల్లి సుభాష్ చంద్ర బోస్ సౌమ్యంగా మాట్లాడతారు. అలాంటిది ఆయనకు సైతం చిర్రెత్తేలా చేసింది టిడిపి అనుకూల మీడియా. అయితే టిడిపి వీడియో చూసిన వారికి అందులో బోస్ వ్యాఖ్యలు హెడ్డింగ్ లో ఉన్నట్లు ఏమి లేదని చూసి టిడిపి పడుతున్న తిప్పల పై చర్చ మొదలు పెడుతూండటం విశేషం.

Tags:    

Similar News