వారి అడ్రస్ చెప్పరూ… పార్టీ మారడంతో…?

దూకుడు రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు అయిన క‌ర్నూలు జిల్లాలో గ‌త ఐదేళ్లలో టీడీపీ, వైసీపీల్లో ఓ వెలుగు వెలిగిన నేత‌లు రాజ‌కీయంగా వేసిన రాంగ్ స్టెప్పుల‌తో ఇప్పుడు [more]

Update: 2021-01-14 11:00 GMT

దూకుడు రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు అయిన క‌ర్నూలు జిల్లాలో గ‌త ఐదేళ్లలో టీడీపీ, వైసీపీల్లో ఓ వెలుగు వెలిగిన నేత‌లు రాజ‌కీయంగా వేసిన రాంగ్ స్టెప్పుల‌తో ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. 2014 ఎన్నిక‌ల్లో క‌ర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లకు మూడు అసెంబ్లీ సీట్లలో మిన‌హా మిగిలిన అన్ని స్థానాల్లోనూ వైసీపీ జెండాయే ఎగిరింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో అస‌లు విప‌క్షాల‌కు వైసీపీ ఛాన్సే ఇవ్వలేదు. 2014లో కోడుమూరులో గెలిచిన మ‌ణిగాంధీ ఆ త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో సైకిల్ ఎక్కేశారు. చివ‌ర‌కు ఎన్నిక‌ల వేళ చంద్రబాబు మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ రామాంజ‌నేయులుకు సీటు ఇవ్వడంతో మ‌ణిగాంధీ తిరిగి వైసీపీ పంచ‌న చేరిపోయారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నా ఆయ‌న్ను ప‌ట్టించుకునే వాళ్లే లేరు.

కేఈ ప్రభాకర్ సయితం….

ఇక ఎన్నికల‌కు ముందు వ‌ర‌కు టీడీపీలో బాప‌ట్ల ఎంపీ సీటు లేదా కోడూమూరు అసెంబ్లీ సీటు అంటూ హ‌డావిడి చేసిన రామాంజ‌నేయులు సైతం ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం ఎక్కడ ఉన్నారో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక ఒక‌ప్పుడు మంత్రిగా ఉండి.. ఎమ్మెల్సీగా ఉన్న కేఈ. ప్రభాక‌ర్ ఇప్పుడు టీడీపీలో ఉన్నా ఎవ్వరికి కొర‌గాని నేత‌గా ఉన్నారు. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గం అంటూ లేకుండా పోవ‌డంతో పొలిటిక‌ల్ సెంట‌ర్లో ఉండి ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

కోట్ల వారసుడు…..

ఇక కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి క‌ర్నూలు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో తిరుగుతున్నారు. ఆలూరులో ఆయ‌న భార్య కోట్ల సుజాత‌మ్మ కూడా కార్యక‌ర్తల‌కు అందుబాటులో ఉంటున్నారు. కోట్ల వార‌సుడు రాఘవేంద‌ర్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో రంగ‌ప్రవేశం చేసే దిశ‌గా గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుంటున్నారు. ఇక ఒక‌ప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నా ఆయ‌న్ను ప‌ట్టించుకునే వాళ్లు లేరు.. క‌నీసం ఆయ‌న వాయిస్ వినే వారు కూడా లేరు. ఆయ‌న కుమార్తె బైరెడ్డి శ‌బ‌రి మాత్రం దూకుడుగా ఉన్నా బీజేపీలో ఆమె వాయిస్ పైకి రావ‌డం లేదు.

రేణుక వెయిటింగ్….

ఇక క‌ర్నూలు ఎంపీగా గెలిచిన బుట్టా రేణుకది సైతం అదే ప‌రిస్థితి. వైసీపీ ఎంపీగా గెలిచి టీడీపీలోకి వ‌చ్చిన‌.. రేణుక సీటు రాలేద‌ని ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఏదో ఒక ప‌ద‌వి రాదా ? అని కాస్తో కూస్తో తిరుగుతున్నా ఆమెకు నాటి క్రేజ్ లేదు.. వైసీపీలో ఆమెను ప‌ట్టించుకునే వాళ్లే లేరు. నందికొట్కూరులో 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఐజ‌య్య సైతం పార్టీ మారి సైకిల్ ఎక్కేశారు. క‌ట్ చేస్తే ఎన్నిక‌ల వేళ చంద్రబాబు ఆయ‌న‌కు షాక్ ఇవ్వడంతో తిరిగి వైసీపీలోకి జంప్ కొట్టేశారు. అస‌లు ఇప్పుడు ఐజ‌య్య అడ్రస్ ఎక్క‌డ ఉందో ప‌ట్టుకోవ‌డం కూడా ఎవ్వరికి సాధ్యం కావ‌డం లేదు.

టీడీపీలోకి వచ్చి…..

ఇక శ్రీశైలం ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి వ‌చ్చిన బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి సైతం టీడీపీలోకి వ‌చ్చి.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకునేందుకు ఏ మాత్రం ఆస‌క్తి చూప‌డం లేదు. బుడ్డా కంటే మంత్రాలయంలో వ‌రుస‌గా రెండుసార్లు ఓడిపోయిన తిక్కారెడ్డే బెట‌ర్ అనిపిస్తున్నారు. మ‌రి ఈ నేత‌లు ఎప్పుడు తిరిగి ట్రాక్ ఎక్కి పొలిటిక‌ల్గా స‌త్తా చాటుతారో ? చూడాలి.

Tags:    

Similar News