టీడీపీ లేదు.. వైసీపీ పుంజుకోదు..అక్కడ రాజ‌కీయం అంతే

తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం అమ‌లాపురం. కోన‌సీమ‌లో విస్తరించి ఉండే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్‌గానే ఉంటాయి. గత ఏడాది ఎన్నిక‌ల్లో ఇక్కడ [more]

Update: 2020-12-14 00:30 GMT

తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం అమ‌లాపురం. కోన‌సీమ‌లో విస్తరించి ఉండే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ఎప్పుడూ హాట్‌గానే ఉంటాయి. గత ఏడాది ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి టీడీపీ త‌ర‌ఫున గంటి మోహ‌న చంద్ర బాల‌యోగి కుమారుడు గంటి హ‌రీష్ మాధుర్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన చింత అనురాధ 39 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. అయితే.. ఈమె నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉంటున్నా పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉంటున్నారని స్థానికంగా వైసీపీ నాయ‌కులే అంటోన్న మాట‌. పార్లమెంటు ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రితోనూ ఆమెకు పెద్దగా స‌ఖ్యత లేదు. అయితే.. ఆమె వాద‌న వింత‌గా ఉంది. అమ‌లాపురం ఇంచార్జ్‌గా తోట త్రిమూర్తుల‌ను నియ‌మించిన త‌ర్వాత త‌న‌కు ప‌నిలేకుండా పోయింద‌ని చెప్పుకుంటున్నార‌ట‌.

టీడీపీ ఇలా….

అంటే.. త‌న‌పై ఆయ‌నే ఆధిపత్యం చేస్తున్నార‌నే కోణంలో అనురాధ అస‌హ‌నంగా క‌నిపిస్తోంది. టీడీపీ త‌రఫున ఓడిపోయిన హ‌రీష్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. త‌న ప‌నేదో తాను చూసుకుంటున్నారు త‌ప్ప.. పార్టీని, నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. టీడీపీ హ‌రీష్‌ను అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో కాకుండా పార్టీ ఆఫీస్‌లో కార్యక్ర‌మాల‌కు వాడుకోవ‌డం కూడా ఇక్కడ టీడీపీకి పెద్ద మైన‌స్‌. ఈ పార్లమెంటు ప‌రిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌రైన నాయ‌కులు లేక టీడీపీ విల‌విల్లాడుతోంది. టీడీపీకి నాయ‌కుల కొర‌త ఎలా ? ఉందో ఇదే చెపుతుంది.

ఇద్దరు మంత్రులు……

ఈ గ్యాప్ .. వైసీపీకి చాలా అనుకూలంగా ఉన్నా దానిని ఏ ఒక్కరు క్యాష్ చేసుకునే ప‌రిస్థితి లేదు. పోనీ.. ఇంచార్జ్‌గా ఉన్న త్రిమూర్తులు అయినా.. ప‌ట్టించుకుంటు న్నారా ? అంటే.. అది కూడా లేదు. ఆయ‌న త‌న‌పై ఉన్న వివాదాల‌ను త‌గ్గించుకునేందుకు ప్రయ‌త్నాలు చేసుకుంటున్నారు. వైసీపీలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లాపురం పార్లమెంట‌రీ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టినా త్రిమూర్తుల‌కు ప్రశాంత‌త లేదు. ఇదే పార్లమెంటు ప‌రిధి నుంచి వైసీపీకి ఇద్దరు మంత్రులు చెల్లుబోయిన వేణు, పినిపే విశ్వరూప్ ఉన్నా వారి వ‌ల్ల వైసీపీకి ప్లస్ కాక‌పోగా… మైన‌స్‌లు ఎక్కువ అవుతున్నాయి.

రెండు పార్టీలకూ….

టి.గ‌న్నవ‌రం ఎమ్మెల్యే చిట్టిబాబు అయితే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రులు వేలు పెడుతుండ‌డంతో ఓ ఎమ్మెల్యేగా ఉన్నా ఉప‌యోగం లేద‌ని బ‌హిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీలోనే రాజోలు, రామ‌చంద్రాపురం, మండ‌పేట‌, అమ‌లాపురం, టి.గ‌న్నవ‌రంలో గ్రూపుల గోల ఎక్కువుగా ఉంది. ఏదేమైనా అమ‌లాపురం పార్లమెంట‌రీ రాజ‌కీయం రెండు పార్టీల‌కు గ‌డ్డుగానే ఉంద‌న్నది వాస్తవం.

Tags:    

Similar News