ఇక దీనిని ఆపలేమోమో? అంతా అటాకింగ్?

కరోనాను అయినా కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మాత్రం అదుపు చేయలేమని తేలిపోతుంది. వేడి వేడి పాలిటిక్స్ కి వేదికగా ఉండే [more]

Update: 2020-04-23 06:30 GMT

కరోనాను అయినా కంట్రోల్ చేయడం సాధ్యం అవుతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మాత్రం అదుపు చేయలేమని తేలిపోతుంది. వేడి వేడి పాలిటిక్స్ కి వేదికగా ఉండే ఆంధ్రప్రదేశ్ లో కరోనా సమయంలో కూడా నేతలు సైలెంట్ గా ఉండటానికి అస్సలు ఇష్టపడటం లేదు. తాజాగా కరోనా కిట్ల కొనుగోలులో కమీషన్ కి వైసిపి కక్కుర్తి పడిందంటూ కన్నా పేల్చిన బాంబు ఆ తరువాత టిడిపి ఇదే అంశంపై తమ నేతలతో విరుచుపడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై యుద్ధానికి సిద్ధమైన అధికారపార్టీ మాటకు మాట విసరడమే కాదు వ్యక్తిగత ఆరోపణలకు దిగిపోయి అటాకింగ్ మోడ్ లోకి వచ్చేసి వాతావరణం మరింత వేడెక్కించింది.

విజయ సాయి తో మొదలై …

కిట్ల వ్యవహారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సవాల్ కి ప్రతి సవాల్ విసిరిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్లేస్ ను ఇప్పుడు వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా భర్తీ చేసేసారు. ఎపి సర్కార్ 730 రూపాయలకు కిట్ కొంటె కర్ణాటక 795 కు ఎలా కొనుగోలు చేసిందని రోజా ప్రశ్నలు సంధించారు. అవినీతి కేంద్రం చేసిందా. కర్ణాటక ప్రభుత్వం తినేసిందా అంటూ రోజా కన్నపై బౌన్సర్ విసిరారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కొనుగోలు చేసిన కిట్ లు మరింత తక్కువ ధర కావడంతో ఇప్పుడు బాల్ కన్నా కోర్ట్ కి చేరింది. కర్ణాటక కానీ ఇతర కొన్ని రాష్ట్రాలు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ఈ అంశం రాజకీయం కోసమే కమలం ఎపి అధినేత వాడుకుంటున్నారని వైసిపి చెప్పక చెప్పేసింది.

టిడిపి వంతు ….

ఎపి లో గత ఎన్నికల ముందు ఉప్పు నిప్పులా బిజెపి తో ఉన్న టిడిపి ఇప్పుడు యుగళ గీతం ఆ పార్టీ తో పాడేందుకు సిద్ధంగా ఉంది. చంద్రబాబు డైరెక్షన్ లో తమ్ముళ్ళు అంతా బిజెపి పై పల్లెత్తు మాట అనకుండా వైసిపి టార్గెట్ గానే దుమ్మెత్తిపోస్తున్నారు. యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు ఇలా అంతా కన్నాకు మద్దతుగా నిలిచి రాబోయే రోజుల్లో కమలంతో స్నేహహస్తానికి పునాది గట్టిగా వేసుకుంటున్నట్లే కనిపిస్తుంది. మరి కాలమే వీరి అనుబంధం ఎలా ఉంటుందో అన్నది తేల్చి చెప్పనుంది. అప్పటివరకు వేచి చుడాలిసిందే.

Tags:    

Similar News