లాస్ట్ బాల్ వేశారు

అఖిల భారత జాతీయ కాంగ్రెస్. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. దేశంలో మారు మూల గ్రామాల్లో సయితం పార్టీ జెండా కన్పిస్తుంటుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి [more]

Update: 2019-07-07 16:30 GMT

అఖిల భారత జాతీయ కాంగ్రెస్. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. దేశంలో మారు మూల గ్రామాల్లో సయితం పార్టీ జెండా కన్పిస్తుంటుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం దాపురించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం కొరవడింది. నిన్న మొన్నటి వరకూ అధ్యక్ష బాధ్యతలను తీసుకున్న సోనియాగాంధీ అనారోగ్య కారణాలతో పక్కకు తప్పుకుని కుమారుడు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను రాహుల్ గాంధీ తీసుకున్న తర్వాత కొన్ని దశాబ్దాల పాటు పార్టీకి నాయకత్వ సమస్య ఉండదని అందరూ భావించారు.

గెలుపోటములు సహజమే అయినా….

కానీ 2019 సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలాన్ని తెచ్చి పెట్టాయి. గెలుపోటములు ఏ పార్టీకి అయినా సహజమే. 2004, 2009లో వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2014లో ఓటమి పాలయింది. 2019 ఎన్నికల్లో కూడా ఓటమి పాలు కావడంతో రాహుల్ గాంధీ తట్టుకోలేకపోయారు. పార్టీ ఓటమని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఎవరూ ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని పలువురు సీనియర్ నేతలు సయితం తప్పుపడుతున్నారు.

గాంధీ కుటుంబం మినహా…..

గాంధీ కుటుంబ నాయకత్వం లేకుంటే కాంగ్రెస్ పార్టీ కకా వికలం అవుతుంది. ఈ ప్రభావం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా పడక మానదు. ముఖ్యంగా మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో రాహుల్ రాజీనామా నిర్ణయంతో కాంగ్రెస్ నేతలు పునరాలోచనలో పడే అవకాశముంది. భవిష్యత్ లేదని ఆ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకుంటే ప్రభుత్వం కూలిపోక తప్పదు. గాంధీ కుటుంబం మినహాయించి మరెవరు అధ్యక్ష బాధ్యతలను చేపట్టినా కాంగ్రెస్ నేతలు మాట వినని పరిస్థిితి. అసలే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కావడంతో నేతల్లో ఆందోళన ఇప్పటి నుంచే ప్రారంభమయింది.

సీనియర్లను పక్కన పెడితే…..

నాయకుడంటే గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. క్యాడర్ లో ధైర్యం నూరిపోయగలగాలి. రాహుల్ గాంధీకి ఆ పరిణితి లేదన్నది పార్టీ వర్గాలే అంగీకరిస్తున్న విషయం. సీనియర్ నేతలు ఎంత నచ్చ చెప్పినా, ఎదురుకాబోయే దుష్ఫలితాల గురించి వివరించినా రాహుల్ గాంధీ ససేమిరా అన్నారు. దీంతో చేసేది లేక కొత్త నేత కోసం వెదుకులాట ప్రారంభించారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా పదవులకోసం పాకులాడుతున్న సీనియర్లను బయటకు పంపాలని ఈనిర్ణయం తీసుకున్నట్లు కనపడుతుంది. సీనియర్లను పక్కన పెడితే రాహుల్ గాంధీ ఇప్పటికిప్పుడు పార్టీ పగ్గాలు అందుకోవడానికి రెడీగా ఉన్నారన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది. రాహుల్ గాంధీ నిజంగా అదే ఆలోచనలో ఉంటే సీనియర్లకు పక్కకు తప్పుకోక తప్పదు.

Tags:    

Similar News