బాబుకు అయిందే జగన్ కి కూడా అయిందా…!?

ఏపీలో చంద్రబాబు జగన్ ఇద్దరు నాయకులు. ఇద్దరూ ప్రాంతీయ పార్టీల అధినేతలు. ఇపుడు ఏపీ రాజకీయాల్లో వీరే జనానికి ఆప్షన్ గా ఉన్నారు. బాబు అయిదేళ్ళ పాలన [more]

Update: 2019-07-06 03:30 GMT

ఏపీలో చంద్రబాబు జగన్ ఇద్దరు నాయకులు. ఇద్దరూ ప్రాంతీయ పార్టీల అధినేతలు. ఇపుడు ఏపీ రాజకీయాల్లో వీరే జనానికి ఆప్షన్ గా ఉన్నారు. బాబు అయిదేళ్ళ పాలన చూసిన ప్రజలు ఈసారి జగన్ కి ఛాన్స్ ఇద్దామనుకున్నారు. బాబు వల్ల కానివి ఎన్నో జగన్ తో సాధ్యమవుతాయని అనుకున్నారు. అందుకే వైఎస్ జగన్ ను బంపర్ మెజారిటీతో అధికారంలోకి తెచ్చారు. అయితే ఏపీలో ఉన్నది చంద్రబాబు అయినా జగన్ అయినా తమకు సంబంధం లేదని, ఎవరైనా ఒక్కటేనని మోడీ సర్కార్ అంటోంది. బాబు కలసి వున్నా విడిపోయినా, జగన్ కొత్త స్నేహం కలుపుతున్నా మా వైఖరి మాత్రం మారదు కాక మారదు అంటోంది బీజేపీ సర్కార్. ఏపీ మీద తమకు ఎటువంటి అభిమానం ప్రత్యేకంగా లేదని కూడా పక్కా క్లారిటీగా చెప్పేస్తోంది.

బడ్జెట్లో మొండి చేయి…

కేంద్ర బడ్జెట్ తాజాగా అ ప్రవేశపెట్టింది తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్. బడ్జెట్ మొత్తం చూస్తే ఎక్కడా ఏపీ వూసు కానీ ధ్యాస కానీ కనిపించలేదు. ఇక్కడ నుంచి ఆమె ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ స్ప్రుహ కూడా బడ్జెట్లో కానరాలేదు. ఏపీకి మేము ఏం చేయమంతే అన్నట్లుగా బడ్జెట్లో కనీసం ఏపీ గురించి తలవనైనా తలవలేదు. ప్రత్యేక హోదా సంగతి లేదు, ఏపీలో ఉన్న జాతీయ విద్యా సంస్థల అతీ గతీ పట్టించుకోలేదు. రైల్వే జోన్ ఇచ్చామని మాట మాత్రం చెప్పి వూరుకున్నారు. దాని సంగతి అంతకంటే లేదు. ఇక ఏపీలో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ళు ఇవేమీ కూడా బడ్జెత్లో ప్రస్తావనకు లేకుండా పోయాయి. కనీసం విభజన హామీలు నెరవేరుస్తామని మాట మాత్రం కూడా చెప్పకపోవడం బట్టి చూస్తే మోడీకి ఏపీ అంటే ఎంతో ఇదో అర్ధమవుతోంది.

బాబు జగన్ ఒక్కటేనా…?

కేంద్రంతో బాబుకు సరైన సఖ్యత లేక సాధించుకోలేకపోయారని అంతా అనుకున్నారు. పైగా మోడీతో బాబుకు ఇగో సమస్యలు ఉన్నాయని కూడా భావించారు. ఇక్కడ జగన్ సీఎం గా ఉన్నారు. మరి ఇపుడైనా మోడీ మారతారని, తనకు ఏ రకంగానూ పోటీ కానీ జగన్ కు భారీగా సాయం అందిస్తారని కూడా ఆశించారు. దానికి కొంత ఆశ కల్పించింది జగన్ ఢిల్లీ టూర్. మోడీ గాఢాలింగనం చేసుకుని మరీ సాదరంగా ఆహ్వానించిన దాన్ని చూసిన వారంతా ఏపీకి మోడీ, జగన్ కాంబో వల్ల ఏదో జరిగిపోతుందని భ్రమ పడ్డారు. ఆ భ్రమే నిజమైందిపుడు. మోడీ తాను ఏపీకి ఎంత చేయాలో అంతే చేస్తాను, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటేనంటూ ఏపీకి కచ్చితమైన సమాధానం తాజా బడ్జెట్ రూపంలో పంపించారు. మరి బాబు జగన్ ఒక్కటేనా అని జగన్ అనుకునే పరిస్థితి ఉందిపుడు. కాదు అనిపించుకోవాలంటే జగన్ ఏదోఒకటి చేయాల్సిందే.

Tags:    

Similar News