మళ్లీ జంప్ అవుతున్నారా…?

కొండ్రుమురళి మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా? ఆయన ఈ మేరకు అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు. కొండ్రుమురళి [more]

Update: 2019-07-07 05:00 GMT

కొండ్రుమురళి మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా? ఆయన ఈ మేరకు అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు. కొండ్రుమురళి అతి త్వరలోనే టీడీపీ జెండా పీకేస్తారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో కొండ్రు మురళితో పాటు మరికొందరు కూడా తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నారని చెబుతున్నారు.

కేవలం రెండింటిలో…

ఇటీవల జరిగిన ఎన్నికలలోశ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. టెక్కలి నియోజకవర్గం నుంచి కింజారపు అచ్చెన్నాయుడు, ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్ లు మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. మిగిలిన ఎనిమిది చోట్ల టీడీపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. శ్రీకాకుళం పార్లమెంటు స్థానం మాత్రం టీడీపీ తిరిగి నిలబెట్టుకుంది. అయితే ఇప్పుడు కొందరు టీడీపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. అందులో కొండ్రు మురళి ఒకరు.

పోటీ చేసి ఓడిన….

కొండ్రుమురళి రాజాం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన చేరిన వెంటనే అప్పటి వరకూ రాజాం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న ప్రతిభా భారతిని తప్పించి చంద్రబాబునాయుడు కొండ్రు మురళిని ఇన్ ఛార్జి చేశారు. రాజాం టిక్కెట్ కూడా కొండ్రు మురళికే ఇచ్చారు. ప్రతిభా భారతికి ఎమ్మెల్సీ అవకాశమిస్తామని చంద్రబాబు నాయుడు అప్పట్లో మాట ఇచ్చారు.

కన్నా రాయబారం…..

అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం కొండ్రుమురళి తెలుగుదేశం పార్టీలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. రాజాం నియోజకవర్గంలో కళా వెంకట్రావు, ప్రతిభా భారతి వర్గాల గ్రూపులు తట్టుకోలేక పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్యవర్తులను కొండ్రుమురళి వద్దకు పంపినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరితే భవిష్యత్తు ఉంటుందని కన్నా కొండ్రుకు నచ్చ చెప్పినట్లు చెబుతున్నారు. కొండ్రు మురళితో పాటు మరికొందరు టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కమలం కండువా కప్పుకునే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News