లీకులతో లబోదిబో.. నెక్ట్స్ టార్గెట్ ఎవరో?

వరస అరెస్ట్ లతో తెలుగుదేశం పార్టీ నేతలు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ కేసులో ఎవరు అరెస్ట్ అవుతారోనన్న టెన్షన్ సైకిల్ పార్టీని పట్టుకుంది. నేతల పరామర్శకే టీడీపీ [more]

Update: 2020-06-30 03:30 GMT

వరస అరెస్ట్ లతో తెలుగుదేశం పార్టీ నేతలు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ కేసులో ఎవరు అరెస్ట్ అవుతారోనన్న టెన్షన్ సైకిల్ పార్టీని పట్టుకుంది. నేతల పరామర్శకే టీడీపీ అధినేత చంద్రబాబు సగం సమాయాన్ని వెచ్చిస్తున్నారు. వారానికి ఒకరు అరెస్ట్ అవుతారని, పేర్లతో సహా అధికార పార్టీ ఇస్తున్న లీకులతో గుండెల్లో దడ ప్రారంభమయింది. పెద్ద స్థాయి నుంచి కిందిస్థాయి వరకూ టీడీపీ నేతల పరిస్థితి ఇదే. మరోవైపు జంపింగ్ లు కూడా టీడీపీ నేతలను, క్యాడర్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇప్పడిప్పుడే కోలుకుంటున్నా….

అధికారం కోల్పోయి ఏడాది కావడంతో ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలు కోలుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై గళం విప్పేందుకు సిద్దమవుతున్నారు. ఈ సమయంలో అరెస్ట్ లు వారిని వెనకడగువేసేలా చేస్తున్నాయి. చింతమనేని ప్రభాకర్ తో ప్రారంభమయిన అరెస్ట్ లు ఇంకా ఆగడం లేదు. శుక్రవారం వస్తుందంటే ఎవరు అరెస్ట్ అవుతారోనన్న భయం పట్టుకుంది. చింతమనేని ప్రభాకర్ అనేక కేసుల్లో ఇరుక్కుని చాలా కాలం జైలు జీవితం గడిపి వచ్చారు. ఇప్పటికీ ఆయన పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

అచ్చెన్నతో పాటు…..

ఇటీవల అచ్చెన్నాయుడు అరెస్ట్ తో మరింత కలవరం ప్రారంభమయింది. అచ్చెన్నాయుడు లాంటి నేతను అరెస్ట్ చేశారంటే తమ సంగతేంటని నేతలు వణికిపోతున్నారు. అచ్చెన్నాయుడుతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అఖిల ప్రియ, కేఈ కుటుంబ సభ్యులపై కేసుుల నమోదయ్యాయి. వీరిలో ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియరు.

మరి కొందరి పేర్లు…..

వీరితో పాటు కొందరిని వివిధ అవినీతి కేసుల్లో అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. అయితే మాజీ మంత్రులు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పితాని సత్యనారాయణ వంటి వారి పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. లోకేష్ టార్గెట్ గా కూడా కేసులు బయటకు తీస్తున్నారని కూడా ప్రచారం ఉంది. మొత్తం మీద చంద్రబాబు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో వరస అరెస్ట్ లు టీడీపీని ఇబ్బంది పాలు చేస్తున్నాయి.

Tags:    

Similar News