ఇంతకీ ఆయన ఉన్నట్లా లేనట్లా ?

విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు గీత దాటకుండా ఉన్నారని ఈ మధ్యనే అధినాయకత్వం తెగ సంబరపడుతోంది. వైసీపీ నుంచి కొందరికి బిగ్ ఆఫర్లు వచ్చినా కూడా ఏ [more]

Update: 2020-12-28 05:00 GMT

విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు గీత దాటకుండా ఉన్నారని ఈ మధ్యనే అధినాయకత్వం తెగ సంబరపడుతోంది. వైసీపీ నుంచి కొందరికి బిగ్ ఆఫర్లు వచ్చినా కూడా ఏ మాత్రం ఆరాటపడకుండా ఎక్కిన సైకిల్ దిగకుండా పసుపు గూడులో పదిలంగా ఉంటున్నారని హై కమాండ్ ముచ్చట పడుతోంది. అయితే ఈ సమయంలో కూడా కొందరి నాయకుల వ్యవహార శైలి మాత్రం కొత్త డౌట్లు పుట్టిస్తోంది. అంతే కాదు వారు పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్న సందేహాలకూ తావు ఇస్తోంది.

అక్కడే తేడా..?

టీడీపీలో ఉండడానికి నాయకులకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా విశాఖ రాజధానికి వ్యతిరేకంగా సౌండ్ చేయమంటే మాత్రం పెద్దగా ముందుకురావడంలేదు. ఇది గత ఏడాదిగా అధినాయకత్వానికి ఎదురవుతున్న అతి ముఖ్య సమస్యగానే ఉంది. విశాఖ జనం రాజధానిని కోరుకోవడంలేదని తమ్ముళ్ల సాక్షిగా అనుకూల మీడియాలో అచ్చేసి మరీ నిరూపిద్దామని టీడీపీ పెద్ద స్కెచే వేసింది. కానీ తమ్ముళ్ళు మాత్రం వచ్చేందుకు జంకుతున్నారు. ఎంత చెడ్డా తాము ఈ గడ్డ మీదనే రాజకీయం చేయాలంటూ సున్నితంగానే తప్పించుకుంటున్నారు.

ఆయన మిస్…..

ఇక చోడవరం నియోజకవర్గంలో ఇప్పటికి రెండు సార్లు గెలిచిన కే ఎస్ ఎన్ రాజు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన గంటాకు అనుచరుడుగా ఉంటూ వచ్చారు. చంద్రబాబుకు కూడా సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆయన టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం మాత్రం పలు అనుమానాలకు అవకాశం ఇస్తోంది. తాజాగా చోడవరంలో అమరావతి రాజధానికి మద్దతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఆద్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తే రాజు డుమ్మా కొట్టారు. ఇదిపుడు పార్టీలో హాట్ టాపిక్ అయింది. అందరూ వచ్చి ఆయన మిస్ కావడంతో పార్టీలో ఒక రేంజిలో చర్చ సాగుతోంది.’

టికెట్ దక్కదా …?

ఇక రాజు గైర్ హాజర్ కావడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికి మూడు సార్లు చంద్రబాబు ఆయనకు టికెట్ ఇస్తే రెండు సార్లు గెలిచారు. అయితే తాజా ఎన్నికల్లో ఓటమి వెనక పార్టీ నేతలే ఉన్నారని రాజు అసహనంతో ఉన్నారు. పైగా చోడవరంలో కాపులు ఎక్కువగా ఉన్నారు. గతంలో కూడా టీడీపీ కాపులకు ఇక్కడ టికెట్ ఇచ్చింది. కానీ గత మూడు టెర్ములుగా రాజు టికెట్ సాధిస్తున్నారు. ఆయన్ని మోయడం తమ వల్ల కాదని కాపులు ఇచ్చిన గట్టి ఝలక్ తో రాజావారు ఓటమి చెందారని అంటున్నారు. పైగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కాపు నేత. ఆయన్ని ఢీ కొట్టాలంటే వచ్చే ఎన్నికల్లో కాపులనే నిలబెట్టాలని హై కమాండ్ కి విన్నపాలు వరసబెట్టి వెళ్తున్నాయి. దాంతో తనకు టికెట్ ఈసారి రాదు అన్నది పూర్తిగా డిసైడ్ అయ్యాకనే రాజు టీడీపీకి దూరం అవుతున్నారని అంటున్నారు. మొత్తానికి తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్న రాజు సైకిల్ దిగితే టీడీపీకి అదే పెద్ద దెబ్బ అవుతుంది అంటున్నారు.

Tags:    

Similar News