నిజమైన నాయకులే లేరట… అంతా ఆటలో అరటిపండ్లేనా?

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడే వారే నిజమైన నాయకుడు. ఓటమి తర్వాత కన్పించని వారు లీడర్ అనిపించుకోరు. స్వార్థపూరిత రాజకీయ నేతలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. ముఖ్యంగా [more]

Update: 2020-05-13 11:00 GMT

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడే వారే నిజమైన నాయకుడు. ఓటమి తర్వాత కన్పించని వారు లీడర్ అనిపించుకోరు. స్వార్థపూరిత రాజకీయ నేతలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తమకు టిక్కెట్లు కేటాయించాలని చంద్రబాబు వద్దకు పరుగులు తీసిన ఎంపీ అభ్యర్థులు నేడు పత్తా లేకుండా పోయారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో…..

2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఓటమిని తెలుగుదేశం పార్టీ చవి చూసింది. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే టీడీపీ నుంచి విజయం సాధించారు. ఎమ్మెల్యేల్లో ముగ్గురు పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీకి గుడ్ బై కొట్టేశారు. గెలిచిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయిన 22 మంది అభ్యర్థుల జాడ ప్రస్తుతం తెలియకుండా పోయింది. వారిలో 90 శాతం మంది కనీసం పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడంలేదు.

ఓటమి తర్వాత పార్టీని వీడి…..

అరకు నుంచి పోటీ చేసి ఓడిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ రాష్ట్రంలోనే లేరు. ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ నుంచి పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ పత్తా లేకుండా పోయారు. ఇక రాజమండ్రి నుంచి పోటీ చేసిన మాగంటి రూప రాజకీయాలకు పూర్తిగా దూరమయిపోయారు. అమలాపురం నుంచి పోటీ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటి హరీష్ మాధుర్ యాక్టివ్ గా లేరు. ఏలూరు ఎంపీ అభ్యర్ధి మాగంటి బాబు పార్టీ వైపు కూడా చూడటం లేదు.

పత్తా లేకుండా పోయి…..

నరసరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు పార్టీలో ఉన్నారో? లేదో? కూడా తెలియదు. నెల్లూరు, కడప ఎంపీ అభ్యర్థులు బీద మస్తాన్ రావు, ఆదినారాయణరెడ్డలు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోాయరు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులు డీకే సత్యప్రభ, పనబాక లక్ష్మిలు కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. యాక్టివ్ గా ఉంది కేవలం ఐదారుగురు మాత్రమే. దీనిపై ఇటీవల చంద్రబాబు కూడా సమీక్ష చేశారని తెలిసింది. ఎంపీ అభ్యర్థులు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లకు కూడా హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. మొత్తం మీద ఎంపీలుగా పోటీచేసిన వారు పార్టీని పట్టించుకోక పోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.

Tags:    

Similar News