మార్చేస్తున్నారుగా….!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేవం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ స్థాపించిన తర్వాత [more]

Update: 2019-08-03 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేవం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ స్థాపించిన తర్వాత ఇంతటి అపజయాన్ని ఎన్నడూ చూడలేదు. దీనికి కారణం కొందరు నేతలు అని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబును ఫలితాల తర్వాత కలసిన కొందరు స్థానిక నాయకులు కూడా వారిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో చంద్రబాబు కీలక నేతలను మార్చేందుకు సిద్దమవుతున్నారు.

చౌదరిపై ఫిర్యాదులు….

అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి కీలకంగా ఉన్న ప్రోగ్రామ్స్ కమిటీ పనితీరు బాగాలేదని చంద్రబాబు గుర్తించారు. ఈ కమిటీకి ఎమ్మెల్సీ వివివి చౌదరి చూస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న చౌదరి ఐదేళ్ల పాటు ప్రోగ్రామ్స్ కమిటీని, పార్టీ కార్యాలయ నిర్వహణ బాధ్యతను చూశారు. అయితే కార్యకర్తలతోనూ, నేతలతోనూ చౌదరి వ్యవహారశైలి సరిగా లేదని చంద్రబాబుకు అనేక మంది ఫిర్యాదు చేశారు. దీంతో చౌదరిని మార్చాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పొలిట్ బ్యూరోను సయితం….

ఇక పార్టీకి అత్యంత కీలకమైన పొలిట్ బ్యూరో సయితం ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పొలిట్ బ్యూరో లో ఉన్న నేతలు కేవలం అమరావతికే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తన దృష్టికి తీసుకురావడంలో గత ఎన్నికల సమయంలో విఫలమయ్యారని చంద్రబాబు భావిస్తున్నారు. కేవలం షో చేసే వారు కాకుండా పార్టీకోసం నిబద్దతతో పనిచేసేవారిని పొలిట్ బ్యూరో లో నియమించాలని చంద్రబాబు నిశ్చయించారంటున్నారు.

పూర్తిగా ప్రక్షాళన దిశగా…..

పార్టీలోని అన్ని విభాగాలను ప్రక్షాళన చేయాలని చంద్రబాబుపై వత్తిడి కూడా వస్తోంది. ప్రధానంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్ర కార్యాలయంలో ఉన్న నేతలు సయితం కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నారని వారిని కూడా మార్చాలని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చంద్రబాబునాయుడును కోరినట్లు తెలిసింది. గుంటూరు పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం మరో మూడు నెలల్లో పూర్తి కానుంది. ఈలోపే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ఆలోచనగా ఉంది.

Tags:    

Similar News