అందువల్లే టీడీపీ ఓడిపోయిందా

చూస్తూ ఉంటే పసుపు పార్టీ పరాభవం పాపం చినబాబు నెత్తిన పడుతున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటాయి. చంద్రబాబుకు ఎందుకు ఓడిపోయామో అర్ధం [more]

Update: 2019-07-22 00:30 GMT

చూస్తూ ఉంటే పసుపు పార్టీ పరాభవం పాపం చినబాబు నెత్తిన పడుతున్నట్లే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటాయి. చంద్రబాబుకు ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడంలేదు. ప్రత్యర్ధి వైసీపీ ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట సైకిలు చిత్తు అయిన కారణాలు చెబుతూనే ఉంది. మరో వైపు టీడీపీలో నిన్నటి వరకూ ధైర్యం చేయలేని వారు సైతం ఇపుడు చంద్రబాబు పరోక్షంలో , ప్రత్యక్షంలో కూడా పార్టీ పతనానికి గల కారణాలను చెప్పేస్తున్నారు. మరి కొందరు స్వరాన్ని బాగా పెంచి మరీ పాపాల భైరవుడు ఎవరో విడమరచి విప్పి చెబుతున్నారు. పార్టీలో నుంచి బయటకు వెళ్లిన వారు అయితే లోకేష్ మీద బండ వేసేస్తున్నారు. నిజానికి చంద్రబాబు పాలన ఒక ఎత్తు అయితే ఆయన కొడుకు లోకేష్ ని పార్టీలోకీ తీసుకురావడం వల్ల జరిగిన భారీ రాజకీయ నష్టం మరో ఎత్తు. ఆ సంగతి టీడీపీని విడిచిన నేతలు చెబుతూంటే అందరికీ అర్ధమవుతోంది.

అవినీతి, అసమర్ధత….

చంద్రబాబు మాటకు వస్తే తనకు నలభయ్యేళ్ల అనుభవం ఉందని చెబుతారు. మరి ఆయన కుమారుడు లోకేష్ కి ఏం అనుభవం ఉందని కీలకమైన అయిదు మంత్రిత్ర శాఖలు ఇచ్చి మంత్రిని చేశారో చెప్పాలి. లోకేష్ ఏ విధంగానూ బాబుకు సరి సాటి కాదు కదా రాజకీయాలు సూట్ కారని నూటికి తొంబయి మంది టీడీపీ నేతలో ఉంది. మరి ఎందుకు భరించారు అంటే నాడు పార్టీ అధికారంలో ఉంది, అందుకు అంతా నోరు మూసుకున్నారు, ఇపుడు ఎటూ టీడీపీ దారుణంగా పతనమైంది. అందువల్ల నోళ్ళు తెరచుకుని గటగటా నిజాలు చెప్పేస్తున్నారు. తాజాగా టీడీపీని విడిచి బీజేపీలో చేరిన అన్నం సతీష్ ప్రభాకర్ లోకేష్ బాగోతాలు ఒక్కోటిగా బయటేస్తున్నారు. ఐటీ శాఖలో అవినీతికి లోకేష్ పాల్పడ్డారని, దాని మీద సీబీఐ విచారణ కోరుతామని అంటున్నారు. లోకేష్ లాంటి అసమర్ధుడు ఉన్న పార్టీలో ఎవరూ ఉండరని కడిగిపారేస్తున్నారు.

కాపునేతల గోడు ఇదే…

ఇక టీడీపీలో ఉన్న సీనియర్ కాపు నేతల గోడు కూడా సరిగ్గా ఇదే. ఇప్పటికి రెండు మార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు సమావేశమైంది లోకేష్ ని పక్కన పెట్టమని డిమాండ్ చేయడానికే. లోకేష్ రావడంతో టీడీపీలో క్రమశిక్షణ తప్పిందని, సామాజిక వర్గ సమీకరణలు పెద్ద ఎత్తున తారు మారు అయ్యాయన్నది కాపు నేతల అభియోగం. ఇక టీడీపీలో ఉంటూ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని గొడవ కూడా సరిగ్గా ఇదే. టీడీపీలో లోకేష్ కోటరీ మూలంగా నష్టపోతున్నామని ఆయన చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పార్టీ నుంచి దూరంగా జరిగిన సుజనా చౌదరి వంటి వారు సైతం లోకేష్ కారణంగానే బాబుతో సంబంధాలు తెగి పక్కకు వెళ్ళిపోయారని అంటారు.

బాబు మాత్రం….

మొత్తం మీద చూస్తే లోకేష్ వల్ల టీడీపీలో పెద్ద సంక్షోభం తలెత్తిందన్నది తమ్ముళ్ల ఏకాభిప్రాయంగా ఉంది. అన్నీ తెలిసినా చంద్రబాబు ఏం జరగలేదు, అసలు ఎందుకు మనం ఓడిపోయామని బీద అరుపులు అరుస్తూంటే తమ్ముళ్లకు చికాకు రాదా మరి. అందుకే ఉన్న వారు మౌనంగా ఉంటున్నారు. పోయిన వారు పోతున్నారు. అన్నం సతీష్ వంటి వారు ఇంకో మాట కూడా చెబుతున్నారు. లోకే ష్ వల్ల టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందని. మరి అధినేత బాబు ఏం చర్యలు తీసుకుంటారో.

Tags:    

Similar News