టీడీపీకి దిక్కులేకుండా పోయిందే

అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. టీడీపీలో ఆధిపత్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఓ వైపు గంటా శ్రీనివాసరావు, మరో వైపు చింతకాయల అయ్యన్నపాత్రుడు. వర్గాలు, [more]

Update: 2019-07-16 11:00 GMT

అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా. టీడీపీలో ఆధిపత్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఓ వైపు గంటా శ్రీనివాసరావు, మరో వైపు చింతకాయల అయ్యన్నపాత్రుడు. వర్గాలు, పోరు ఇలా చాలా కధ సాగింది. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయ్యన్న పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోయి గమ్మునున్నారు. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వల్ప ఓట్లతో బయటపడినా ఆయన దాన్ని గెలుపుగా భావించడంలేదు. పైగా పార్టీ పోయింది. దాంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. విశాఖ నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీకి ఇపుడు దిక్కు లేకుండా పోయింది. మంత్రిగా ఉన్నపుడు ఎటూ ఆఫీస్ ముఖం చూడని గంటా పార్టీ ఓడిపోయిన తరువాత కూడా ఈ వైపు రావడం లేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్నకు ఓటమి తరువాత పూర్తిగా రాజకీయ వైరాగ్యం వచ్చినట్లుంది. ఆయన కూడా మూతికి బిరడా పెట్టేసుకున్నారు.

పెద్దాయన వచ్చినా…

ఇక విశాఖలో పార్టీ బాగోగులు చాలా కాలంగా మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చూస్తున్నారు. పార్టీ పవర్లో ఉన్నపుడు ఆయన ఇంచార్జి మంత్రి కూడా. అటువంటి ఆయన విశాఖకు వస్తే ఇద్దరు మంత్రులు డుమ్మా కొట్టారు. గతంలో అధికారంలో ఉన్నపుడు వీరి హవాయే వేరు. ఆఖరుకు చేసేది లేక ఉన్న కొద్ది మందితోనే సమీక్ష అయిందనిపించి చినరాజప్ప చల్లగా జారుకున్నారు. విశాఖలో పార్టీకి జనం గెలుపు అందించినా కూడా ఇద్దరు మాజీలు ముందుండి నడిపించాల్సిన వేళ ఇలా మౌనం వహించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఫలితాలు వచ్చి రెండు నెలలు గడచినా ఇంకా తేరుకోలేదనడం దారుణమేనని అంటున్నారు

వైసీపీ జోరు….

మరో వైపు అధికారంలో ఉండడంతో వైసీపీ జోరు చేస్తోంది. సిటీలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఖాతరు చేయకుండా అంతా తామే అయి కధ నడిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీ ఇంచార్జులే కనిపిస్తున్నారు. ఇక గంటా గెలిచిన సీటు ఉత్తరంలో ఆయన రాజకీయ శిష్యుడు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పెత్తనం చేస్తున్నారు. ఓడిన సీట్లలో నేనే ఎమ్మెల్యేని అని గట్టిగానే మంత్రి చెప్పుకుంటున్నా గంటా పట్టించుకోవడంలేదు. ఇక సరైన దిశానిర్దేశం లేకపోతే సిటీలో పార్టీ క్యాడర్ చెల్లాచెదురు అవుతుందన్న బెంగ కూడా పసుపు పార్టీలో పట్టుకుంది. తొందరలోనే జీవీఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి పెద్ద నేతలు ఇద్దరూ ఏం చేస్తారో.

Tags:    

Similar News