వారు చేస్తే సంధానం … వీరు చేస్తే అవధానమా?

పట్టిసీమ నీళ్ళు కృష్ణా నదిలో కలిపి నదుల అనుసంధానం చేసేశాం అని ప్రకటించేసింది టిడిపి. దేశంలోనే కృష్ణా గోదావరి సంగమం ఒక చరిత్ర గా ప్రచారం చేసుకుంది. [more]

Update: 2019-08-19 11:00 GMT

పట్టిసీమ నీళ్ళు కృష్ణా నదిలో కలిపి నదుల అనుసంధానం చేసేశాం అని ప్రకటించేసింది టిడిపి. దేశంలోనే కృష్ణా గోదావరి సంగమం ఒక చరిత్ర గా ప్రచారం చేసుకుంది. ఆ వెనుకే దీనిపై వివరణ కోరారు కొందరు కాంగ్రెస్ నేతలు. ఇది నిజమేనా అని కేంద్ర జలసంఘానికి లేఖలు రాస్తే వీరి అబద్ధాలు బట్టబయలు అయ్యాయి. గ్రావిటీ ద్వారా కలిసే అనుసంధానమే తప్ప ఎత్తిపోతల పథకాలతో నదుల అనుసంధానం అనేదే బూతు కింద జలసంఘం గతంలోనే ప్రకటించింది. అయినా తాము చరిత్ర సృష్టించేశాం చూడండి అంటూ మాయ చేసేందుకు కిందా మీదా పడింది నాటి చంద్రబాబు సర్కార్. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని నదులను కలిపేసి హరితాంధ్రప్రదేశ్ చేసేస్తున్న కలర్ కూడా ఇచ్చింది పాత ప్రభుత్వం. ఎన్నికల ముందు ఎన్నో చెబుతారు కాబట్టి అలాంటి ఎన్ని మసాలాలు నూరిపోసినా మొత్తానికి పని జరగక ప్రజల చేతిలో గట్టి పరాభవమే మూటగట్టుకుంది తెలుగుదేశం.

ఇప్పుడు తప్పు అంటున్నారే …

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నీటిని సక్రమంగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధానానికి కేసీఆర్, జగన్ శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయ్యారు. గ్రావిటీ ద్వారా కొంత దూరం నీటిని తరలించి ఆ తరువాత ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం లోకి నీటిని ఎత్తిపోయాలన్నది వీరి సంకల్పం. అయితే ఈ ప్రయత్నం వల్ల ఎపి నష్టపోతుంది తెలంగాణ ఎక్కువ లాభ పడుతుందని చంద్రబాబు వాదిస్తున్నారు. ఈ అనుసంధానం పూర్తిగా తప్పంటూ పెద్దఎత్తునే టిడిపి దుమారం రేపుతోంది.

క్షేమ కరమా…?

తెలంగాణ ప్రాంతం నుంచి కాలువలు వెళ్లడం వల్ల ఆ ప్రాంతానికే మాత్రమే ఎక్కువ లబ్ది అన్నది టిడిపి వాదన గా మారింది. ఈ వాదనను ఇప్పుడు విశ్లేషకులు తప్పుపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభీక్షం గా వుండాలని కోరుకోకుండా ప్రాంతీయ విభేదాలను ప్రజల సెంటిమెంట్ ను రాజేసి రాజకీయం చేయాలని టిడిపి భావించడం తెలుగు ప్రజలకు క్షేమం కాదన్నది నిపుణుల సూచన. తెలంగాణ ప్రజలకు తానే మేలు చేశానని పదేపదే అక్కడ చెప్పి ఎపి ప్రజల ప్రయోజనాలు తానే కాపాడుతున్నట్లు ప్రచారం చేసుకుంటూ ద్విముఖ వ్యూహంతో టిడిపి వెళితే రెండు ప్రాంతాల్లో మరింత చతికిల పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News