Trs : పునరాలోచనలో పడ్డారా? జంప్ కు సిద్ధమయ్యారా?

తెలంగాణ రాష్ట్ర సమితికి గెలుపోటములు కొత్తేమీ కాకపోవచ్చు. కాని గతం వేరు. ఇప్పుడు జరుగుతుంది వేరు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక ప్రభుత్వ నిర్ణయాలపై [more]

Update: 2021-11-13 11:00 GMT

తెలంగాణ రాష్ట్ర సమితికి గెలుపోటములు కొత్తేమీ కాకపోవచ్చు. కాని గతం వేరు. ఇప్పుడు జరుగుతుంది వేరు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక ప్రభుత్వ నిర్ణయాలపై కూడా వ్యతిరేకత కనపడుతుంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఈ రెండేళ్ల కాలంలో పార్టీ నిలదొక్కుకుంటే సరి. లేదంటే పార్టీని మార్చడమే బెటర్ అని కొందరు నేతలు సిద్ధమయినట్లే కన్పిస్తుంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పునరాలోచనలో పడ్డారని తెలిసింది.

ఉప ఎన్నిక ఫలితంతో….

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచింది. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలు సయితం ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఏ ఎమ్మెల్యేకయినా మరోసారి గెలవడం అవసరం. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవని తేలిపోయింది. దీంతో పాటు నియోజకవర్గాల లో గ్రూపులు కూడా ఎక్కువగా ఉన్నాయి.

అనేక నియోజకవర్గాల్లో….

సత్తుపల్లి నియోజకవర్గాన్ని చూసుకుంటే అక్కడ వనమా వెంకటేశ్వరరావు రాకను పార్టీ ఇన్ ఛార్జి జలగం వెంకట్రావుల మధ్య నేటికీ సయోధ్య కుదరలేదు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో జరిగిన సమావేశాలకు సయితం ఆయన హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అలాగే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు సయితం కంఫర్ట్ గా లేరు. సొంత పార్టీ నేతలతోనే వారు ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నికలకు ముందే…..

ఎన్నికలకు ముందే వీరంతా టీఆర్ఎస్ ను వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. టిక్కెట్ల విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయని వీరు భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో తమ అనుచరులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు. మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం తో అనేక మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.

Tags:    

Similar News