కేసీఆర్ లో కలవరం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా హుజూర్ నగర్ లో గెలిచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీని [more]

Update: 2019-10-13 09:30 GMT

హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా హుజూర్ నగర్ లో గెలిచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బతీయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఇందుకోసం నోటిఫికేషన్ వెలువడిన రోజే తమ అభ్యర్థిగా సైదిరెడ్డి అంటూ స్వయంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తర్వాత హుజూర్ నగర్ లో గెలిచేందుకు వామపక్ష పార్టీ అయిన సీపీఐ మద్దతును కూడా కోరారు. అయితే మళ్లీ హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ను కలవరపెట్టే అంశం బయటకు వచ్చింది.

ఇండిపెండెంట్లు శత్రువులుగా….

టీఆర్ఎస్ కు ఇండిపెండెంట్లు శత్రువులుగా మారననున్నారు. ఈవీఎంలలు కావడంతో గుర్తులు సరిగా కనపడవు. దీంతో టీఆర్ఎస్ గుర్తు అయిన కారు సింబల్ ను పోలిన గుర్తులు అనేకం గతంలో ఆ పార్టీని దెబ్బతీశాయి. హుజూర్ నగర్ లో కూడా పెద్దయెత్తున స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరికి కారు గుర్తు పోలిన సింబల్స్ వస్తాయన్న ఆందోళన తొలి నుంచి ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది. తాజాగా హుజూర్ నగర్ లో 38 మంది అభ్యర్థుల వరకూ బరిలో నిలిచారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలను పక్కన పెడితే మిగిలిన ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ గుర్తును కేటాయించాల్సి ఉంటుంది.

కారు గుర్తు పోలిన….

ఇప్పుడు టీఆర్ఎస్ భయానికి అదే కారణమయింది. కారు గుర్తు పోలిన ట్రక్కు, ట్రాక్టర్, ఆటో వంటి గుర్తులతో గత ఎన్నికల్లోనూ అనేక మంది అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కీలక నేతలు కూడా ఈ గుర్తుల కారణంగా ఇంటి దారి పట్టారు. 88 స్థానాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికీ మరో పది స్థానాల్లో గుర్తుల కారణంగానే ఓటమి పాలయ్యామని టీఆర్ఎస్ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం విశ్లేషణలో తేల్చారు. మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు కూడా గుర్తుల కారణంగానే ఓటమి పాలయ్యారని అప్పట్లో టీఆర్ఎస్ ప్రకటించింది.

హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ…..

ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ గుర్తుల విషయం తీసుకెళ్లింది. ట్రాక్టర్, కెమెరా, ట్రక్కు, ఆటో గుర్తులను తెలంగాణ స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వరాదని ఎన్నికల కమిషన్ కోరింది. అయితే ఇప్పుడు దానిని టీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఫలితంగా ఈ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులు ఎంపిక చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ లో కలవరం మొదలయింది. గుర్తుల కేటాయింపు జరగిపోవడంతో ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ట్రక్కు లాంటి గుర్తుతో తమకు ఇబ్బందులు తప్పవని టీఆర్ఎస్ గ్రహించింది. దీనిపై పెద్దయెత్తున ప్రచారం చేస్తోంది. మరి ఈసారి కూడా గుర్తు టీఆర్ఎస్ కొంప ముంచుతుందేమోనన్న ఆందోళన మాత్రం ఆ పార్టీలో నెలకొని ఉంది.

Tags:    

Similar News