ఈసారి అయినా సక్సెస్ అవుతారా?

తెలంగాణ మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విఫలమయ్యారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ఆయన ఐటీ మంత్రిగా అనేక సదుపాయలు [more]

Update: 2020-12-19 00:30 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విఫలమయ్యారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ఆయన ఐటీ మంత్రిగా అనేక సదుపాయలు కల్పించిన ప్రాంతాల్లో సయితం టీఆర్ఎస్ ఓటమి పాలయింది. ఇందుకు ప్రధాన కారణం వరదలేనని పైకి చెబుతున్నా ప్రభుత్వంపై అసంతృప్తి బాగా ఉందని అర్థమయింది. గతంలో 99 స్థానాలను దక్కించుకున్న టీఆర్ఎస్ ఈసారి 56 స్థానాలకే పరిమితమయింది.

అంతా తానే అయి….

అంటే టీఆర్ఎస్ 43 సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు ఇష్టపడలేదు. ఏకపక్షంగా నిలవలేదు. ఇది కేటీఆర్ వైఫల్యమని చెప్పక తప్పదు. మున్సిపల్ శాఖ మంత్రిగా, గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని తాను ఒక్కడే భుజాన వేసుకున్న కేటీఆర్ కు మరో సవాల్ ఎదురుకానుంది.

రెండింటికి త్వరలో…..

త్వరలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు చోట్ల టీఆర్ఎస్ అధికారంలో ఉంది. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఈ రెండు కార్పొరేషన్లను ప్రతిష్టాత్మంకగా తీసుకున్నారు. వరంగల్ కార్పొరేషన్ లో కొంత కాంగ్రెస్ కు బలముంది. బీజేపీకి అంతగా లేదు. అయినా బీజేపీ ఈ మధ్య కాలంలో అక్కడ పట్టుపెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇక్కడ బలంగా ఉండటంతో వరంగల్ గ్రేటర్ ఎన్నికలు కేటీఆర్ కు ఛాలెంజ్ గా మారనున్నాయి. టీఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు ఇబ్బంది పెట్టే అవకాశముందంటున్నారు.

ఖమ్మంలో మాత్రం…..

ఇక ఖమ్మం కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టులు, టీడీపీ ఓటు బ్యాంకు కూడా బలంగా ఉంది. ఈ కార్పొరేషన్ పరిధిలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. ఖమ్మం కార్పొరేషన్ విషయంలో కేటీఆర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారట. ఈ మధ్య కేటీఆర్ ఖమ్మంలోనూ ఐటీ హబ్ ను ప్రారంభించారు. రెండు కార్పొరేషన్ల పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలను ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు పరిష్కరించాలని కేటీఆర్ ఇప్పటికే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులను ఆదేశించారు. మరి కేటీఆర్ కు ఈ రెండు కార్పొరేషన్లలో విజయం దక్కుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News