కరోనా కన్నా ప్రమాదకరంగా ఆ రోగం

తెలంగాణ సర్కార్ ను ఇప్పుడు కరోనా కన్నా ఒక అంశం ఆందోళన కలిగిస్తుంది. అదే మందుబాబులు ఆసుపత్రి పాలుకావడం. ఆ సంఖ్య కూడా కరోనా పాజిటివ్ కేసులకు [more]

Update: 2020-04-08 09:30 GMT

తెలంగాణ సర్కార్ ను ఇప్పుడు కరోనా కన్నా ఒక అంశం ఆందోళన కలిగిస్తుంది. అదే మందుబాబులు ఆసుపత్రి పాలుకావడం. ఆ సంఖ్య కూడా కరోనా పాజిటివ్ కేసులకు డబుల్ ఉండటం. ఎర్రగడ్డ ఆసుపత్రి అంతా కూడా మద్యం ప్రియులతో నిండి పోవడం తలనొప్పిగా మారింది. దాంతో కిం కర్తవ్యం అన్నది టి సర్కార్ కి ఛాలెంజ్ గా పరిణమించింది. తెలంగాణ లో మద్యం సేవించడం కూడా ఒక సంప్రదాయంగా ఎక్కువ ప్రాంతాల్లో నడుస్తుంది. దావత్ పేరిట ఇచ్చే విందుల్లో మద్యం ఏరులై పారుతూ ఉంటుంది. అలాగే కల్లు కాంపౌండ్ లు ఎక్కువే. తాగినోడికి తాగినంత మందు పోసే చోట ఒక్కసారిగా లాక్ డౌన్ దెబ్బకు మందు లేకుండా పోయింది. దాంతో దిమాక్ కరాబ్ అయ్యి అంతా దవాఖానాల బాట పట్టేయడం ఆందోళనకర పరిస్థితి.

రక్షణ కల్పించాలంటున్న మద్యం షాపులు …

మద్యానికి బానిసైన వారు ఆసుపత్రిలో ఒక పక్క క్యూ కడుతుంటే మరోపక్క మద్యం షాపుల్లో చోరీకి స్కెచ్ వేసి సరుకు ఎత్తుకు పోయే ముఠాలు మరోపక్క తెలంగాణ సర్కార్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ షాప్ లో చోరీ జరుగుతుందో అని యజమానులు హడలి పోతున్నారు. తమ షాప్ లకు సర్కార్ రక్షణ కోరుతున్నారు వారు. సాధారణంగా అమ్మకాలు ఉన్న సమయంలో షాప్ యజమానులే రక్షణ కల్పించుకునే వారు. అయితే లాక్ డౌన్ ప్రభావంతో కనీసం రోడ్డుమీదకు రాలేనిపరిస్థితి మద్యం షాపుల యజమానులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మా స్టాక్ కాపాడండి అంటూ పెరుగుతున్న విజ్ఞప్తులు పోలీసులకు, ఎక్సయిజ్ శాఖకు ఇబ్బందికరంగా మారింది.

ఆసుపత్రులకు క్యూ…

ఒక పక్క మద్యం షాపులు మూసివేయడంతో ఆదాయం పడిపోయి ఉన్న దశలో కొత్తగా మధుప్రియులు ఆసుపత్రిలో చేరుతూ ఉండటం ఇంకోపక్క మా షాపులకు రక్షణ కావాలన్న డిమాండ్లు ఎక్కువ అవుతున్న సమస్యనుంచి ఎలా గట్టెక్కాలన్న కసరత్తును ఇప్పుడు టి సర్కార్ చేస్తుంది. ఇటీవల ఇలాంటి సమస్య నుంచే గట్టెక్కించేందుకు కేరళ ప్రభుత్వం వైద్యుల పర్మిట్ పై మద్యం అందజేసేందుకు సిద్ధం అయ్యింది. దీనిని ప్రజాప్రయోజన వాజ్యం కింద హై కోర్ట్ లో ఒకరు సవాల్ చేయడం కోర్ట్ స్టే విధించడంతో ఆ ఎపిసోడ్ అక్కడ ముగిసింది. మరి టి సర్కార్ ఇక్కడ ఏమి చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News