నాడు పీవీ నేడు వైఎస్ ను వద్దనుకున్నారే …?

కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్. అలాగే వైఎస్ అంటే కాంగ్రెస్. ఇది ఆయన మరణించే వరకు హస్తం పార్టీలో రాజన్న మహా ప్రస్థానం సాగింది. అయితే ఆయన [more]

Update: 2021-09-03 09:30 GMT

కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్. అలాగే వైఎస్ అంటే కాంగ్రెస్. ఇది ఆయన మరణించే వరకు హస్తం పార్టీలో రాజన్న మహా ప్రస్థానం సాగింది. అయితే ఆయన మరణం తరువాత వైఎస్ మార్క్ ను పూర్తిగా చెరిపేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేయని ప్రయత్నం లేదు. రాజశేఖర రెడ్డి బాటలో నడిచిన నేతలు మాత్రం ఆయన స్మరణ ఏ పార్టీలో ఉన్నా కానీ చేయడం మానలేదు. రెండు తెలుగు రాష్ట్రాలుగా కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించడానికి కారణం వైఎస్ మరణం ఆయన కుమారుడు జగన్ సొంత పార్టీ పెట్టుకోవడమే అంటారు రాజకీయ నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అంశం ప్రస్తావనకు వస్తే మాత్రం వైఎస్ మాట లేకుండా కాంగ్రెస్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయినా కానీ ఆయన సంస్మరణ సభపై కాంగ్రెస్ అధిష్టానం ఆంక్షలు వైఎస్ అంటే కానీ ఆయన కుటుంబం అంశంలో ఉన్న భయాన్ని మరోసారి బయటపెట్టింది.

సక్సెస్ అయితే …

వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ రాజశేఖర రెడ్డి 12 వర్ధంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆత్మీయులతో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఇటు తెలంగాణ, అటు ఏపీ లోని మాజీ కాంగ్రెస్ నేతలు, అధికారులు, వివిధ పార్టీల్లో ఉన్న నేతలు, వ్యాపార ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు ఉన్నారు. వీరంతా వచ్చి వైఎస్ ను మహా నేత గా కీర్తిస్తే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని అధిష్టానానికి వైఎస్ వ్యతిరేకులు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం ఆంక్షలు విధించేసేంది. పార్టీ నేతలకు ఈ కార్యక్రమానికి వెళ్ళెందుకు అనుమతి లేదని గీత గీసేసింది. రాహుల్ గాంధీ ని ప్రధాని ని చేస్తా అని గతంలో ప్రకటించిన వైఎస్ మాట కు ఆయన కుటుంబం కట్టుబడితే సంస్మరణ సభకు పోవొచ్చని షరతులు సైతం పెట్టడం ఇప్పుడు చర్చనీయంగా మారింది.

పీవీ కి అవమానాలే …

దీనికి ప్రధాన కారణం ఈ సంస్మరణ కార్యక్రమంలో తెలంగాణ లో తండ్రి పేరుతో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడమే కారణమని తెలుస్తుంది. షర్మిల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండటంతో దీర్ఘ కాలంలో వైఎస్ ఇమేజ్ తోనే షర్మిల ఎదుగుతారన్న అంచనాతోనే కాంగ్రెస్ ఆందోళనగా కనిపిస్తుంది. దాంతో కాంగ్రెస్ తో మమేకం అయిన వైఎస్ ను తనవాడు కాదన్నట్లే హస్తం ఈ సభ సాక్షిగా దూరం చేసేసుకుంది. గతంలో పివి నరసింహారావు విషయంలోనూ కాంగ్రెస్ ఇదే తప్పు చేసింది. ఆయన సమర్ధతను ప్రపంచం గుర్తించినా హస్తానికి ఆయన కంటకంగా కనిపించడమే తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీ పీవీ ని కీర్తిస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీకి షాక్ లు ఇస్తూ వస్తుంది. ఇలా స్వయంకృత అపరాధాలతో కాంగ్రెస్ తన గొయ్యి తానె తవ్వుకుంటుందా అన్నట్లు వ్యవహారం నడుస్తుంది. మొత్తానికి ఒకప్పుడు పివి ని కాదనుకున్న కాంగ్రెస్ నేడు వైఎస్ మావాడు కాదు పొమ్మన్నడం గాంధీ ల కుటుంబమే అసలు పార్టీ అన్న సంకేతాలతో ఏమి సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News