తేజస్వి ఇంకా ఆశతోనే?

బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఆర్జేడీ మాత్రం తన ప్రయత్నాలను ఆపడం లేదు. కొద్ది తేడాతో అధికారం చేజారడంతో ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ బాగా [more]

Update: 2020-12-15 17:30 GMT

బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఆర్జేడీ మాత్రం తన ప్రయత్నాలను ఆపడం లేదు. కొద్ది తేడాతో అధికారం చేజారడంతో ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ బాగా డీలా పడ్డారు. అందుకే ఆయన నిత్యం మంత్రులపైనా, ప్రభుత్వంపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా నితీష్ కుమార్ పై వ్యక్తిగత మాటల దాడిని తేజస్వి యాదవ్ ప్రారంభించారు. నితీష్ కుమార్ ను వ్యతిరేకించే వారు తమతో జట్టుకడతారన్న ఆశాభావంతో తేజస్వి యాదవ్ ఉన్నారు.

చిరాగ్ ను బుజ్జగించాలనుకున్నా…..

ఇటీవల రాంవిలాస్ పాశ్వాన్ మృతి చెందడంతో ఏర్పడిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీ తన పార్టీకి చెందిన సుశీల్ కుమార్ మోదీకి ఇచ్చింది. అయితే ఈ సమయంలో చిరాగ్ పాశ్వాన్ ను తన వద్దకు చేర్చుకోవాలని తేజస్వి యాదవ్ ప్రయత్నించారు. చిరాగ్ పాశ్వాన్ తల్లిని సుశీల్ కుమార్ మోదీపై పోటీకి నిలపాలని ప్రయత్నించారు. కానీ చిరాగ్ పాశ్వాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో సుశీల్ కుమార్ మోదీ రాజ్యసభకు పోటీ లేకుండానే ఎన్నికయ్యారు.

అవకాశం కోసం….

మరోవైపు తేజస్వి యాదవ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. నితీష్ కుమార్ ను బీజేపీ ఎంతోకాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించదన్న అంచనాలో ఉన్నారు. అందుకే జేడీయూ నేతలతో కొంత సఖ్యత పాటించాలని తేజస్వి యాదవ్ భావిస్తున్నారు. సామాజిక వర్గాల పరంగా కొందరు సీనియర్ నేతలను జేడీయూ ఎమ్మెల్యేలతో సఖ్యత కొనసాగించాలని తేజస్వి యాదవ్ ఆదేశించినట్లు చెబుతున్నారు.

జేడీయూ ఎమ్మెల్యేలతో టచ్ లో….

నితీష్ కుమార్ ను పదవి నుంచి దించితే జేడీయూ ఎమ్మెల్యేలు తమకు మద్దతు పలికేలా ఇప్పటి నుంచే తేజస్వి యాదవ్ పనులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆర్జేడీ ముఖ్యనేత ఒకరు ఇదే పనిలో ఉన్నారని తెలుస్తోంది. బీజేపీ కంటే జేడీయూ ఎమ్మెల్యేలే తమ వైపునకు వచ్చేందుకు అవకాశాలుండటంతో ఆ ప్రయత్నంలో తేజస్వి యాదవ్ ఉన్నారు. మరి తేజస్వి యాదవ్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి మరి.

Tags:    

Similar News