ఏదైనా తన అకౌంట్ లోకేనట?

బీహార్ ఎన్నికల్లో మహాగడ్బందన్ ను గెలిపించే బాధ్యతను తేజస్వియాదవ్ తన భుజానకెత్తుకున్నారు. అంతా తానే అయి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకూ పది ర్యాలీలు, మూడు బహిరంగ సభల్లో [more]

Update: 2020-11-03 18:29 GMT

బీహార్ ఎన్నికల్లో మహాగడ్బందన్ ను గెలిపించే బాధ్యతను తేజస్వియాదవ్ తన భుజానకెత్తుకున్నారు. అంతా తానే అయి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకూ పది ర్యాలీలు, మూడు బహిరంగ సభల్లో తేజస్వి యాదవ్ పాల్గొంటున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని తేజస్వియాదవ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. రాహుల్ గాంధీ తప్ప మరే జాతీయ నేత ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు.

నితీష్ ను దెబ్బకొట్టాలని…..

తేజస్వి యాదవ్ ఈసారి నితీష్ కుమార్ ను గట్టి దెబ్బ కొట్టాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తన తండ్రి లాలూ యాదవ్ లేకపోవడంతో అంతా తానే అయి చూసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అంతా తేజస్వి యాదవ్ దగ్గరుండి చేశారు. కూటమిలోని పార్టీల సర్దుబాటులో కూడా తానే పైచేయి సాధించారు. చివరకు కూటమి చేత ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనపేరునే ఆయన ప్రకటించుకున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో దెబ్బతిన్నా…..

బీహార్ లో పార్లమెంటు ఎన్నికల్లో తేజస్వి యాదవ్ సారథ్యంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లి దెబ్బతినింది. అయితే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు వ్యత్యాసం ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ ఎన్నికల ఫలితాలను తేజస్వియాదవ్ గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే రాష్ట్రీయ జనతాదళ్ అత్యధిక సీట్లను సాధించింది. అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని తేజస్వి యాదవ్ అంచనా వేస్తున్నారు.

అభ్యర్థులందరికీ……

తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను జైలుకు పంపిన ఎన్డీఏ కూటమిపై నిప్పులు చెరుగుతున్నారు తేజస్వి యాదవ్. లాలూపై ఉన్న సానుభూతి ఖచ్చితంగా తమను విజయతీరాలకు చేరుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే తేజస్వి యాదవ్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొన్నాంటున్నారు. కూటమి తరపున పోటీ చేసే అందరూ అభ్యర్థులకు ఆయన అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు. మొత్తం మీద విజయమైనా, ఓటమైనా తన ఖాతాలోనే వేసుకునేందుకు తేజస్వి యాదవ్ రెడీ అయ్యారు.

Tags:    

Similar News