అదృష్టం ఈ రూపంలో వస్తుందా?

బీహార్ ఎన్నికలు సమీపించే కొద్దీ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ ఓట్లకు భారీగా గండి పడే అవకాశముందని తేలింది. వివిధ సంస్థలు జరిపిన సర్వేల్లో [more]

Update: 2020-10-27 16:30 GMT

బీహార్ ఎన్నికలు సమీపించే కొద్దీ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ ఓట్లకు భారీగా గండి పడే అవకాశముందని తేలింది. వివిధ సంస్థలు జరిపిన సర్వేల్లో ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని తేలినా, రోజురోజూకూ మహాకూటమి సయితం బలపడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రోజురోజుకూ ప్రజల్లో బలం పెంచుకుంటున్నారని తేలింది.

కూటములను ఏర్పాటు చేసి…..

బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన మహాకూటమి, జేడీయూ, బీజేపీ కూటములు తలపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో మరో కూటమి ఏర్పాటయింది. దళితులు, ముస్లిం ఓటు బ్యాంకు దీనివల్ల చీలిపోయే అవకాశముందంటున్నారు. ఉపేంద్ర కుశ్వాహ, మాయావతి, అసదుద్దీన్ ఒవైసీ ఏర్పాటు చేసిన కూటమి ఎవరి ఓట్లకు గండికొడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

లోక్ జనశక్తి పార్టీ పోటీతో…..

ఇక ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి విడిగా పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ కూడా భారీగా ఓట్లను చీలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో సానుభూతి ఎక్కువగా ఉంటుందని, అందుకే ఈ పార్టీకి ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశముందని సర్వేల్లో వెల్లడయింది. ఈ పార్టీ చీల్చే ఓట్లన్నీ ఎన్డీఏ కూటమికి చెందినవే కావడంతో అధికార పార్టీలో అలజడి మొదలయింది.

తేజస్వికి పెరుగుతున్న…..

ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను మొన్నటి వరకూ ఎక్కువ మంది సమర్ధిస్తూ వస్తున్నారు. నితీష్ కుమార్ కు 31 శాతం మంది సమర్థిస్తుండగా, తేజస్వి యాదవ్ ను 27 శాతం మంది ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తున్నారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం కేవలం నాలుగు శాతం మాత్రమే కావడంతో ఎన్నికల నాటికి తేజస్వి యాదవ్ మరింతగా పుంజుకునే అవకాశముందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీహార్ లో హంగ్ అసెంబ్లీ ఏర్పడినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News