ముందుగానే హ్యాండ్సప్ అనేస్తున్నారా?

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ కూటమి దూకుడు మీద ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీలో మాత్రం కదలికలు కన్పించడం లేదు. ఇప్పటికే [more]

Update: 2020-07-13 18:29 GMT

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూ కూటమి దూకుడు మీద ఉంది. కానీ ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీలో మాత్రం కదలికలు కన్పించడం లేదు. ఇప్పటికే బీజేపీ సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది. జేడీయూ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. కానీ రాష్ట్రీయ జనతా దళ్ లో మాత్రం నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

లాలూ జైలుకెళ్లడంతో….

లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లిన తర్వాత పార్టీ కార్యక్రమాలను దగ్గరుండి తేజస్వియాదవ్ నడుపుతున్నారు. అయితే కుటుంబంలో తలెత్తిన విభేదాలతో కొంత స్పీడ్ తగ్గించారనే చెప్పాలి. తేజస్వియాదవ్ నాయకత్వాన్ని ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అంగీకరించడం లేదు. ప్రత్యేకంగా పార్టీ పెట్టి మరీ సవాల్ విసిరారు. దీంతో నేతలకు, క్యాడర్ దిశా నిర్దేశం చేసే నేత లేకుండాపోయారు.

ఆర్జేడీలో ముసలం…..

లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో పార్టీ ఏకతాటిపై నడిచేది. ఆయన మాట వేదంగా చెల్లుబాటు అయ్యేది. కానీ తేజస్వియాదవ్ నాయకత్వాన్ని కొందరు నేతలు సయితం వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీలు అధికార జేడీయూలో చేరిపోయారు. మరికొంతమంది సయితం అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే పార్టీలో విభేదాలు తలెత్తడం, నాయకత్వంపై నమ్మకం లేకపోవడం పెద్దదెబ్బగా భావిస్తున్నారు.

కాంగ్రెస్ నేతలు సయితం…

2015లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆర్జేడీ సాధించింది. ఆ స్థానాలను నిలబెట్టుకోవడమూ ఇప్పుడు కష్టంగా మారింది. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆర్జేడీలో జరుగుతున్న పరిణామాలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎక్కువ సంఖ్యలో సీట్లు డిమాండ్ చేసే అవకాశముంది. నితీష్ కుమార్ లాంటి నేతలను ఢీకొట్టాలంటే పటిష్టమైన నాయకత్వంతో ఉండాలసిన ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందుగానే చేతులెత్తేసినట్లు కనపడుతుంది.

Tags:    

Similar News