తేజస్వి ప్రయత్నాలు ఫలిస్తాయా?

బీహార్్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రీయ జనతాదళ్ ను నడిపిస్తున్న తేజస్వియాదవ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి తేజస్వి [more]

Update: 2020-01-17 17:30 GMT

బీహార్్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రీయ జనతాదళ్ ను నడిపిస్తున్న తేజస్వియాదవ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి తేజస్వి యాదవ్ ఇప్పటి నుంచే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. జైలులో ఉన్న తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ సూచనలు, సలహాల మేరకు ఆయన పార్టీని గాడినపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కుటుంబంలో తలెత్తిన విభేదాలను సయితం పరిష్కరించుకునే దిశగా తేజస్వియాదవ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఉప ఎన్నికల్లో….

2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ కలసి మహాగడ్బంధన్ గా ఏర్పడి విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే లాలూ కుటుంబం అవినీతి కేసుల్లో చిక్కుకోవడంతో నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలసి పోయారు. ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ పశుదాణా కుంభకోణం కేసులో జైలుకు వెళ్లిపోయారు. లాలూ జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఆర్జేడీ మంచి ఫలితాలనే సాధించింది. నాయకత్వంపై నమ్మకాన్ని తేజస్వి యాదవ్ తెచ్చుకున్నారు.

లోక్ సభ ఎన్నికలలో….

కానీ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ కుదేలయిపోయింది. కుటుంబంలోనూ విభేదాలు తలెత్తాయి. తేజస్వియాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సొంత పార్టీ పెట్టుకుని పోటీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఆర్జేడీ విఫలమవ్వడంతో మళ్లీ తేజస్వి యాదవ్ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే అప్పటి నుంచి తేజస్వి యాదవ్ అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. ఈసారి కూడా కాంగ్రెస్, ఆర్జేడీ మరికొన్ని చిన్న పార్టీలు కలసి బరిలోకి దిగనున్నాయి.

నియోజకవర్గాల్లో పర్యటిస్తూ….

జార్ఖండ్, హర్యానా ఎన్నికల తర్వాత తేజస్వియాదవ్ లో కొంత నమ్మకం ఏర్పడిందంటున్నారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్సార్సీకి వ్యతిరేకంగా ఇప్పటకే తేజస్వి యాదవ్ ప్రజల్లోకి వెళుతున్నారు. నితీష్ కుమార్ ను బీహారీలు ఈసారి విశ్వసించరని ఆయన అత్యంత విశ్వాసంతో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో తేజస్వియాదవ్ పర్యటిస్తూ నేతల్లోనూ, క్యాడర్ లోనూ జోష్ నింపుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే తేజస్వియాదవ్ నాయకత్వంపై నమ్మకం ఏర్పడుతుంది. లేదంటే ఆర్జేడీకి ఇబ్బందులు తప్పవు.

Tags:    

Similar News