వారి కొంప ముంచిన కోహ్లీ సేన

కొహ్లీ సేన పరాజయం వారికే పరిమితం కాలేదు. ఎందరి కొంపలో మునిగిపోయేలా చేసింది. వరల్డ్ కప్ లో టీం ఇండియా ఓటమి కోట్లాది భారత అభిమానులకు గట్టి [more]

Update: 2019-07-14 02:17 GMT

కొహ్లీ సేన పరాజయం వారికే పరిమితం కాలేదు. ఎందరి కొంపలో మునిగిపోయేలా చేసింది. వరల్డ్ కప్ లో టీం ఇండియా ఓటమి కోట్లాది భారత అభిమానులకు గట్టి షాక్ నే ఇచ్చింది. ఈ సంగతి పక్కన పెడితే అనేక మందికి తీవ్ర ఆర్ధిక నష్టాన్నే మిగిల్చింది. ముఖ్యంగా వరల్డ్ కప్ లో టీం ఇండియా లీగ్ దశలో చెలరేగి ఆడుతున్న తీరుతో అంతా ఫైనల్ చేరడం గ్యారంటీ అన్న అంచనా కు వచ్చేశారు. ఇక క్రీడా వ్యాఖ్యాతలు విశ్లేషకులు ఇదే పక్కా అనేశారు కూడా. ఇంకేముంది ఇంగ్లాండ్ లోని భారత అభిమానులు వేలాదిగా టికెట్లు కొనేశారు. దాంతో ఇప్పుడు క్రికెట్ మక్కా లార్డ్స్ బోసిగా ఫైనల్ మ్యాచ్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం అవుతుంది.

అమ్మకానికి ఫైనల్ టికెట్లు …

ఇప్పుడు లార్డ్స్ లో ఫైనల్ తిలకించే వారికి విక్రయించిన టికెట్లు 80 శాతం భారత అభిమానుల చేతుల్లో వున్నాయి. సెమిస్ లో కోహ్లీ సేన ఇంటిదారి పట్టడంతో ఇప్పుడు అభిమానులు అంతా ఈ టికెట్లను ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ అభిమానులకు అమ్మకానికి తిరుగుతున్నారు. ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెట్ స్టార్ నిషామ్ ట్విట్టర్ లో సైతం భారత అభిమానులకు టికెట్లు కొనుక్కోండి అంటూ విజ్ఞప్తి చేయడం గమనిస్తే పరిస్థితి ఎలా ఉందో స్పష్టం అవుతుంది. మరోపక్క ఐసిసి కూడా టీం ఇండియా ఫైనల్ నిష్క్రమణ తో భారీగా నష్టపోయింది.

కోట్లలో నష్టం…..

ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కప్ ప్రసార హక్కులు పొందిన స్టార్ స్పోర్ట్స్ సైతం 15 కోట్ల రూపాయల నష్టానికి గురైనట్లు తెలుస్తుంది. ఇక ప్రకటన కర్తల కు భారీ నష్టమే వాటిల్లుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్లు న్యూజిలాండ్ – ఇంగ్లాండ్ నాలుగున్నరదశాబ్దాల వరల్డ్ కప్ కల సంగతి ఎలా వున్నా టీం ఇండియా ఓటమి అందరికి నష్టాలా వాన కురిపించడమే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

Tags:    

Similar News