ఏపీ రాజ‌ధానిలో హై ఓల్టేజ్‌గా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక ?

ఏపీ రాజ‌ధానిలో ప్రస్తుతం జ‌రుగుతున్న.. జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ను మించిన హై ఓల్టేజ్‌గా మారింది ఓ ఎన్నిక‌. ఈ ఎన్నిక‌కు గ‌తంలో ఇక్కడ ప్రాథినిత్యం వ‌హించిన [more]

Update: 2021-02-16 05:00 GMT

ఏపీ రాజ‌ధానిలో ప్రస్తుతం జ‌రుగుతున్న.. జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థల ఎన్నిక‌ల‌ను మించిన హై ఓల్టేజ్‌గా మారింది ఓ ఎన్నిక‌. ఈ ఎన్నిక‌కు గ‌తంలో ఇక్కడ ప్రాథినిత్యం వ‌హించిన హేమాహేమీల‌తో పాటు వైసీపీ అభ్యర్థిని కూడా నిల‌బెట్టే అవ‌కాశాలు ఉండ‌డంతో అమరావ‌తి ప్రాంత ఓట‌రు తీర్పు ఎలా ? ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. ఆ ఎన్నిక జ‌రిగే స్థానం ఏదో కాదు గుంటూరు – కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ స్థానం. ఈ శాస‌న‌మండ‌లి స్థానానికి ఇప్పటికే నోటిఫికేష‌న్ రావ‌డంతో ఉత్కంఠ ఏర్పడింది. రాజ‌ధానిపై అధికార, విప‌క్షాల్లో జరుగుతోన్న అనుకూల, వ్యతిరేక ప్రచారం ఒక‌టి అయితే.. ఉపాధ్యాయ వ‌ర్గాల ఓట్లతో జ‌రుగుతోన్న ఎన్నిక కావ‌డంతో ఈ విద్యావంతుల తీర్పు ఎటు వైపు ఉంటుంది ? అన్నదే ఆస‌క్తిగా మారింది. అందులోనూ అధికార వైసీపీకి కూడా ఓ వ్యక్తికి మ‌ద్దతు ఇవ్వాల‌న్న నిర్ణయం తీసుకోవ‌డ‌మే ఇక్క‌డ ఆస‌క్తిగా మారింది.

ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా….

ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఏఎస్‌. రామ‌కృష్ణ ప‌ద‌వీ కాలం వ‌చ్చే నెలాఖ‌రుతో ముగియ‌నుంది. ఇప్పటి వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ స‌భ్యుడిగా మండ‌లిలో కొన‌సాగుతోన్న ఆయ‌న ఈ సారి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలో ఉండ‌డం ఆ పార్టీకి ఓ షాక్‌. గ‌తంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు జిల్లాల‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు క‌ష్టప‌డి మ‌రీ పార్టీ మ్యాండెట్‌పై ఆయ‌న్ను గెలిపించారు. ఈ సారి మాత్రం ఆయ‌న పార్టీకి దూరంగా స్వతంత్రంగా బ‌రిలో ఉంటున్నారు. ప్రచారం కూడా చేస్తున్నారు. గ‌త కొన్ని సంవ‌త్సరాలుగా ఉపాధ్యాయుల స‌మ‌స్యల కోసం తాను ఎన్నో పోరాటాలు చేశాన‌న్న ధీమా ఆయ‌న‌లో ఉంది.

వామపక్షాల మద్దతుతో….

ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి వామ‌ప‌క్ష పార్టీల అనుబంధ సంఘాలు అయిన ఎస్టీఎఫ్‌, యూటీఎఫ్‌ల మ‌ద్దతుతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వర‌రావు రంగంలో ఉన్నారు. గ‌తంలో ప‌ట్టభ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన ఆయ‌న ఈ సారి ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రేసులో ఉన్నారు. ప‌లు వామ‌ప‌క్ష సంఘాల మ‌ద్దతు ఆయ‌న‌కు బ‌లంగానే ఉన్నా… వామ‌ప‌క్షేత‌ర సంఘాల మ‌ద్దతు ఆయ‌న‌కు ఎంత వ‌ర‌కు ఉంటుంద‌న్న దానిపైనే ఆయ‌న గెలుపు ఓట‌ములు డిసైడ్ కానున్నాయి.

వైసీపీ స‌పోర్ట్ క‌ల్పల‌త‌కేనా ?

రాజ‌ధాని ప్రాంతంలో జ‌రుగుతోన్న ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ నేరుగా అభ్యర్థిని ప్రక‌టిస్తుందా ? లేదా ? అన్నది క్లారిటీ లేక‌పోయినా ఆ పార్టీ అనుబంధ సంఘాల స‌మాచారం ప్రకారం పార్టీ మ‌ద్దతు క‌ల్పల‌త‌కే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆమె భ‌ర్త విద్యాశాఖ‌లో ఉన్నతాధికారి కావ‌డంతో వైసీపీకి అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు ఆమె కోసం ప్రచారం కూడా ప్రారంభించాయ‌ని తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం కూడా క‌ల్పల‌త‌కే మ‌ద్దతు ఇవ్వాల‌ని నిర్ణయం తీసుకుంద‌ని.. పార్టీలో కీల‌కంగా ఉండే ఓ స‌ల‌హాదారు కూడా అందుకే ఓకే చెప్పార‌ని అంటున్నారు. ఏదేమైనా అమ‌రావ‌తి జిల్లాల్లో ఉపాధ్యాయుల తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందా ? లేదా ? అన్నది ఈ ఎన్నిక డిసైడ్ చేయ‌నుండ‌డంతో ఈ ఎన్నిక స్థానికంగా హై ఓల్టేజ్‌గా మారింది.

Tags:    

Similar News